Hero Vishal Clarity on Contesting as MLA From Kuppam: కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎలాగైనా అక్కడ ఎమ్మెల్యేగా తిరుగు లేకుండా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడుని ఓడించాలని ఉద్దేశంతో అధికార వైసీపీ హీరో విశాల్ ను రంగంలోకి దించుతోందని అప్పట్లో ప్రచారం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఈ ప్రచారం మీద హీరో విశాల్ స్పందించారు. నటించిన లాఠీ అనే సినిమా తమిళ తెలుగు భాషల్లో డిసెంబర్ 23వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్న విశాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా కుప్పం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తమ కుటుంబానికి చాలా వ్యాపారాలు ఉన్నాయని కుప్పంలో ప్రతి విషయం తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు.


అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని, తాను నటుడిగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గం కాదని పేర్కొన్న ఆయన తాను పవన్ కళ్యాణ్ అభిమానిని కూడా చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమే కానీ కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం మాత్రం లేదని అన్నారు. సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీకి దిగుతానని పేర్కొన్న విశాల్ కుప్పంలో తన తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసేవారని ఆ సమయంలో మూడేళ్ల పాటు కుప్పంలోనే నివాసం ఉన్నానని గుర్తు చేసుకున్నారు.


నిజానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎలా అయినా కుప్పం సీటు దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ జగన్ సైతం కుప్పంలో పర్యటిస్తూ కుప్పాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం అని కూడా ప్రకటించారు. అయితే కుప్పంలో భరత్ను అభ్యర్థిగా ప్రకటించక ముందు విశాల్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో విశాల్ ఈ వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. 


Also Read: Pathaan Film : షారుక్ ఖాన్ తన కూతురితో కూర్చుని పఠాన్ సినిమా చూడాలట.. అయ్యే పనేనా?


Also Read: Venkatesh: వెంకటేష్ విగ్గు రహస్యం బయటపెట్టిన మేకప్ మాన్..ఒక్కో విగ్గు అన్ని వేలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.