Vishal on Puneeth Rajkumar: మరణం వరకూ అంత గొప్ప వ్యక్తి అని ఎవరికీ తెలియదు. మరణానంతరం ఆ వ్యక్తి సేవా కార్యక్రమాలన్నీ ఒక్కసారిగా వెలుగుచూశాయి. ఆ వ్యక్తి సేవా కార్యక్రమాల బాథ్యత తీసుకుంటానని మాటిచ్చి మరో హీరో గొప్పు మనసు చాటుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదాన్ని మిగిల్చిన ఘటన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) ఆకస్మిక మరణం. పునీత్ మరణవార్త దేశమంతా కదిలించేసింది. పునీత్ మరణం వరకూ అతన్నొక సినిమా నటుడిగానే ఈ ప్రపంచం చూసింది. మరణానంతరం పునీత్ చేసిన ఎన్నో లెక్కకు మించిన సేవా కార్యక్రమాలు వెలుగు చూశాయి. పునీత్ గొప్పతనం, అతని దయార్ధ్య హృదయం, నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ప్రపంచానికి అప్పుడే పరిచయమయ్యాయి. పునీత్ రాజ్‌కుమార్ బయటి ప్రపంచానికి తెలియకుండా 26 అనాథాశ్రమాలు, 44 ఉచిత పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, 18 వందల అనాథ పిల్లల దత్తత, మైసూరులో ఆడపిల్లలకు శక్తిధామ్ శిక్షణాకేంద్రం నిర్వహిస్తున్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. 


పునీత్ మరణంతో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. పునీత్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. అతని సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలిశాయి. అందుకే పునీత్ మరణం దేశమంతా ప్రముఖమైంది. పునీత్ సేవాకార్యక్రమాలపై మరో నటుడు విశాల్(Vishal)స్పందించాడు. పునీత్ వంటి గొప్పవ్యక్తిని ఇంతవరకూ చూడలేదని ప్రశంసించాడు. నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి చెప్పాడు. ఎనిమి (Enemy Movie)ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్‌కు నివాళులర్పించాడు. పునీత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. అతని మరణం చిత్రపరిశ్రమకే కాకుండా సమాజానికి తీరనిలోటుగా అభివర్ణించాడు. చలనచిత్ర పరిశ్రమలో పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదన్నారు. పునీత్ సమాజం కోసం చాలా మంచి పనులు చేశారని కీర్తించారు. ఇక నుంచి పునీత్ చదివించిన 18 వందల బాధ్యతను తాను చూసుకుంటానని మాటిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు హీరో విశాల్. విశాల్ చెప్పిన మాటలిప్పుడు వైరల్ అవుతున్నాయి. విశాల్ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విశాల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. విశాల్ నటించిన ఎనిమి సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also read: Team India Failure Record: పరాజయంలో టీమ్ ఇండియా 22 ఏళ్ల రికార్డు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి