Poonam Kaur fibromyalgia : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. ఇంతగా బాధపడుతోందా?.. అసలేం జరిగిందంటే?
Poonam Kaur fibromyalgia పూనమ్ కౌర్ ప్రస్తుతం ఎంత బాధపడుతుందో అందరికీ తెలిసి వచ్చింది. పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోందని, ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధితో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
Poonam Kaur fibromyalgia టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటోందట. పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధి సంక్రమించిందనే వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి. ఇది మందు కాదు.. ప్రేమతో ఇస్తున్నారు.. దీన్ని వల్లే నా రోగం కూడా తగ్గుతుంది అంటూ పూనమ్ కౌర్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక పూనమ్ కౌర్‌కు వచ్చిన ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయట. నిద్రలేమితనం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అలసట, మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం, కండరాల సమస్యలు ఏర్పడటం అనేవి ఈ వ్యాధి లక్షణాలు.
పూనమ్ కౌర్ ఆరోగ్యంపైన ఓ ప్రెస్ నోట్ వచ్చింది. నవంబర్ 10వ తేదీన సూరత్‌లోని గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలనే నిరసన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొందట. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష కూడా చేసిందట. అదే రోజు సాయంత్రం 12వ తేదీన ఢిల్లీలో బ్రహ్మకుమారి కార్యక్రమానికి వెళ్లింది.
అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లిందట. దీంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యిందట. ఆమె కేరళలో ట్రీట్మెంట్ తీసుకుందట. ఆ తరువాత మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటోందట. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి ఆత్మిశ్వాసంతో ఉందని చెప్పుకొచ్చారు.
ఇక టాలీవుడ్‌లో హీరోయిన్లు ప్రస్తుతం ఇలాంటి వింత వ్యాధులతో బాధపడుతున్నారు. సమంత ఏమో మయోసైటిస్ అంటూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటోంది. కల్పికా గణేష్ కూడా సమంతలానే మయోసైటిస్‌తో బాధపడుతోంది. తనకు థర్డ్ స్టేజ్ అని కల్పిక కూడా చెప్పేసింది. ఇప్పుడు ఇలా పూనమ్ కౌర్ విషయం బయటకు వచ్చింది. అసలే పూనమ్ కౌర్‌కు ప్రస్తుతం సినిమా ఆఫర్లేమీ లేవు. పూనమ్ కౌర్ తన సినిమాలతో కంటే.. కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది.
మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ట్రోలింగ్‌కు గురైంది. రాహుల్ గాంధీ పూనమ్ కౌర్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. చేతిలో చేయి వేసి పట్టుకుని ఉన్న ఆ ఫోటోలు బాగానే వైరల్ అవ్వడంతో పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కింద పడిపోతూ ఉంటే.. పట్టుకున్నాడంటూ కవర్ చేసింది. కానీ జనాలు మాత్రం మరింతగా ట్రోల్ చేశారు. వీడియో అంతా చూశాం.. నువ్ ఎక్కడ పడిపోబోయావ్.. ఎక్కడ పట్టుకున్నాడు అంటూ ఇలా జనాలు ట్రోల్ చేయసాగారు.
Also Read : Thank You TRP Rating : నాగ చైతన్యకు ఘోర పరాభవం.. మరీ అంత తక్కువా?.. నిఖిల్ కంటే దారుణంగా
Also Read : Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook