Rambha Family Car Accident : ఒకప్పటి హాట్ హీరోయిన్ రంభ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌తో హాయిగా జీవించేస్తోంది. తన భర్త, పిల్లలను చూసుకుంటూ చక్కగా ఉంటోంది. అయితే అలాంటి రంభకు, ఆమె ఫ్యామిలీకి ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో రంభ ఫ్యామిలీకి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీ అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే అవన్నీ చిన్న గాయాలేనని, కానీ తన కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు రంభ వేసిన పోస్ట్ మీద అందరూ స్పందిస్తున్నారు. స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా.. ఇంకో కారు అనుకోకుండా తమ కారును ఢీ కొట్టిందని, ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయి. కానీ నా కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్లోనే ఉంది.. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి.. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు.. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి అంటూ రంభ వేడుకుంది.


 



ఇక ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలు రంభ ఫ్యామిలీని అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు. ఓరి దేవుడా.. జాగ్రత్తగా ఉండుమా.. మీ కోసం నేను ప్రార్థిస్తాను అని స్నేహ చెప్పుకొచ్చింది. ఓ.. మీరేం బాధపడకండి.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. మీకోసం నేను ప్రార్థిస్తాను అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. బిగ్ బాస్ ఫేమ్ ప్రియ సైతం స్పందించింది. మీరు భయకండి.. ధైర్యంగా ఉండండి.. మా ప్రార్థనలు మీ వెంట ఉంటాయి అని చెప్పుకొచ్చింది.


ఓరి దేవుడా.. అయితే మీరు సురక్షితంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.. జాగ్రత్తగా ఉండండి.. మీ కోసం నా ప్రేమ, ప్రార్థనలు పంపిస్తున్నాను అని శ్రీదేవీ విజయ్ కుమార్ కామెంట్ చేసింది. మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారని వినడం ఎంతో సంతోషంగా ఉంది.. నీకు మరింత శక్తిని ఆ దేవుడివ్వాలని కోరుకుంటున్నాను అని రాధిక శరత్ కుమార్ పేర్కొంది. ఇలా కోలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రంభకు, రంభ ఫ్యామిలీకి అండగా నిలబడుతున్నారు.


Also Read :Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్


Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook