Manjima Mohan Gautham Karthik Relation : కోలీవుడ్‌లో కొత్త జంట సందడి చేస్తోంది. నటి మంజిమా మోహన్, కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేస్తూ ఇద్దరూ ఎమోషనల్ పోస్ట్ వేశారు. దీంట్లో మంజిమా షార్ట్ అండ్ స్వీట్‌గా చెబితే.. గౌతమ్ మాత్రం తన సుధీర్ఘమైన ప్రేమ కథను పూసగుచ్చినట్టుగా చెప్పేశారు. ఈ మేరకు గౌతమ్, మంజిమా వేసిన పోస్ట్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సరైన వ్యక్తి మనం జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది?.. మన కడుపులో బట్టర్ ఫ్లైలో ఎగిరినట్టుగా, గుండెళ్లో ఏదో గంటలు మోగినట్టుగా, మన జీవితం అంతా కూడా ప్రేమతో నిండిపోతుందని అందరూ చెబుతుంటారు. మంజిమా మోహన్, నాది కచ్చితంగా విభిన్న మార్గాల్లో ప్రయాణం సాగుతుంటుంది.. ఇద్దరం ఒకరిపై ఒకరం ప్రాంక్స్ చేసుకుంటూ ఉంటాం. బైక్ రైసింగ్ చేసుకుంటూ ఉంటాం. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం.
మా మధ్య ఏదో చిన్న బంధం మొదలైందని నాకు అర్థమైంది.. మొదట్లో ఈ బంధానికి నేను స్నేహం అని పేరు పెట్టాను.. కానీ అంతకంటే బలమైన బంధమది.. ఆ తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ అని పేరు పెట్టాను.. కానీ దాని కంటే ఎంతో బలమైన బంధం.. కానీ అది రోజురోజుకూ పెరుగుతూనే వచ్చింది.. నేను ఇవన్నీ చేయగలనా? అని అనుకుంటే.. నన్ను ప్రోత్సహించినందుకు, నాకు అండగా నిలబడుతున్నందుకు థాంక్స్. నన్ను నేను చులకనగా చూసుకోకుండా.. నాలో పాజిటివిటీ పెంచుతుంటావ్..
ఇది వరకు ఎన్నడూ చూడని విధమైన ప్రశాంతత నాలో నింపావ్. అదంతా కూడా నీవల్లే జరిగింది. మన మధ్య ఉన్న ఈ బంధాన్ని వర్ణించేందుకు ప్రేమ అనే చిన్న పదం కూడా సరిపోదు. నువ్ నా పక్కనే ఉంటే.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను నేను ఎదురిస్తాను. నువ్ నాతో ఈ జీవితాన్ని పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇకపై నేను నీ ప్రేమను ప్రతీ రోజూ పొందుతాను. చివరి క్షణాల వరకు ఈ ప్రేమ ఇలానే పెరుగుతూ ఉంటుంది. నా మనస్పూర్తిగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. ఇక మనిద్దరం కలిసి మన జీవితాలను ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
మంజిమ మోహన్ పోస్ట్ చేస్తూ.. మూడేళ్ల క్రితం నా బతుకు అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఓ రక్షకుడిగా వచ్చావ్.. నన్ను కాపాడావ్.. నేను నా జీవితాన్ని చూసే కోణాన్ని, దృష్టిని మార్చేశావ్. నేను ఎంత లక్కీనో తెలిసి వచ్చేలా చేశావ్. నేను ఎప్పుడూ పిచ్చిదానిలా ఉంటే.. నువ్వే నన్ను బయటకు తీసుకొచ్చావ్. మార్చావ్. మనకు ఎదురయ్యే కష్టాలను అంగీకరించడం నేర్పించావ్.. నన్ను నన్నుగా ప్రేమించావ్.. అదే నాకు చాలా నచ్చింది.. ఇప్పుడు ఎప్పుడూ నువ్వే నాకు సర్వస్వం అంటూ మంజిమ షేర్ చేసింది.
Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read : Rakul Preet Singh Pics: బికినీ అందాలతో సెగలు రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ హాట్ నెస్ అంతకుమించి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook