Adivi Sesh Hit 2 Teaser: విశ్వక్ సేన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా శైలేష్ కొలను హిట్ అనే సినిమా తెరకెక్కించారు. నాని సమర్పించిన ఈ సినిమాని ఆయన సోదరి త్రిపురనేని ప్రశాంతి నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 2021 వ సంవత్సరంలో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. కానీ సినిమా హీరోను మాత్రం మార్చేశారు. మొదటి సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తే రెండవ భాగంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీతు వర్మ స్థానంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది రావు రమేష్, భానుచందర్, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. డిసెంబర్ రెండో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా యూనిట్ సినిమా టీజర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమా టీజర్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది.


ఇక టీజర్ ను బట్టి చూస్తే అడివి శేష్ విశాఖపట్నంలో పని చేసే ఒక పోలీసు అధికారి కాగా ఆయనకు ఒక యువతిని అన్ని శరీర భాగాలు నరికి చంపిన ఒక కేసు ఎదురవుతుంది. దీంతో ఆయన రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో అడవి శేష్ కేడీ అనే పాత్రలో కనిపిసున్నారు. ఇక రావు రమేష్ డీజీపీ పాత్రలో కనిపిస్తుండగా సినిమా అంతా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో సాగనుంది.



అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన హిట్ 2 (హిట్ ది సెకండ్ కేస్) నిజానికి చాలా రోజుల క్రితమే షూట్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జూలై 29న హిట్ 2ను విడుదల చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో సినిమాను వాయిదా వేశారు. 
Also Read: Harish Shankar Salman Khan: డేట్లు ఇచ్చే వరకూ కదిలేది లేదు.. సల్లూ భాయ్ డేట్ల కోసం భీష్మించుకు కూర్చున్న హరీష్ శంకర్?


Also Read: Mahesh - Trivikram: మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య వివాదం.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook