Fighter teaser Out: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) టైటిల్ రోల్ లో నటిస్తున్న మూవీ ఫైటర్(Fighter). సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ లో ఎనలేని క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను శుక్రవారం (డిసెంబర్ 8) ఉదయం విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైటర్ టీజర్ చూస్తే చాలు మూవీ ఏ లెవల్లో ఉండబోతుందనేది తెలుస్తోంది. ప్రచార చిత్రం మెుత్తం ఫైటర్ జెట్ విన్యాసాలతో నింపేశారు మేకర్స్. గాల్లో ఫైటర్ జెట్స్ తో హృతిక్, దీపికా చేసిన విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అంతేకాకుండా రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 70 సెకన్ల టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే (జనవరి 25) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. షారుఖ్ కు పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై వీరలెవల్లో అంచనాలు ఉన్నాయి. టీజర్ ఈ విధంగా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరు ఊహించుకోవచ్చు. 



Also Read: Junior Mehmood: హిందీ చిత్రసీమలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి..


ఈ చిత్రంలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే), గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపించనున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 


Also Read: Extra Ordinary Man Twitter Review:ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్విట్టర్ రివ్యూ.. నవ్వులు పూయించడంలో సక్సెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook