Srinivasa Murthy Death : డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణం.. బాధపడ్డ హృతిక్ రోషన్, సూర్య.. ట్వీట్లు వైరల్
Dubbing Artist Srinivasa Murthy Death డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో నిన్న చెన్నైలో మరణించారు. ఆయన మరణంతో ఎంతో మంది డబ్బింగ్ హీరోల గొంతు మూగబోయినట్టు అయింది.
Dubbing Artist Srinivasa Murthy Death డబ్బింగ్ సినిమాలకు ప్రధానం సరైన గొంతులను వెతికి పట్టుకోవడమే. హీరోలకు మరీ ముఖ్యంగా సరైన వాయిస్‌ను వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డబ్బింగ్ హీరోలకు వాయిస్ సెట్ అయితే మాత్రం సినిమాకు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. అలా సూర్య, అజిత్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, మోహన్ లాల్ ఇలా ఎంతో మందికి డబ్బింగ్ చెబుతూ జనాలకు దగ్గరయ్యారు శ్రీనివాస మూర్తి. తెరపై వాళ్లు రియల్ హీరోలు అయితే.. తెర వెనుక మాత్రం శ్రీనివాస మూర్తి రియల్ హీరో.
ఆయన గొంతు లేకపోతే వారంతా కూడా ఇక్కడ జీరోలే. సూర్య సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ అయినా, రొమాంటిక్ డైలాగ్స్ అయినా , కామెడీ యాంగిల్ అయినా కూడా శ్రీనివాస మూర్తి ఎంతో అద్భుతంగా చెప్పేస్తుంటారు. ఇక ఆయన డబ్బింగ్ చెప్పినట్టుగా కాకుండా.. నిజంగానే అది సూర్య వాయిస్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటి మూర్తిఇప్పుడు లేకపోవడం అందరికీ బాధాకరమైన విషయమే. ఇక నుంచి ఈ స్టార్ హీరోలకు డబ్బింగ్ ఎవరు చెబుతారో.. ఆ గొంతును జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.
ఇలా తన గొంతును అరువిచ్చి తెలుగు జనాలకు దగ్గరకు చేసిన శ్రీనివాసమూర్తి మరణం పట్ల సూర్య స్పందించాడు. సంతాపాన్ని వ్యక్తం చేశాడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని, బాధను కలిగిస్తుంది.. తెలుగులో నాకు ఇంతటి ప్రేమ దక్కడానికి కారణం ఆయనే. ఆయన గొంతు, ఎమోషన్స్ నా పాత్రలకు ప్రాణం పోశాయి. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను సర్.. మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇక హృతిక్ రోషణ్ ట్వీట్ వేస్తూ.. శ్రీనివాస మూర్తి సర్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడానికి మీ గొంతే నాకు సాయ పడింది.. మీరు సినిమా పరిశ్రమకు చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ఎమోషనల్ అయ్యాడు.
Also Read: Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి