Hrithik Roshan - Fighter: ఆ సీన్స్ కారణంగా హృతిక్ రోషన్ `ఫైటర్` సినిమాకు షాక్ ఇచ్చిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్..
Hrithik Roshan - Fighter: హృతికో రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్గా నటించిన `ఫైటర్` మూవీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ మూవీని ఆ సన్నివేశాల కారణంగా `ఫైటర్` సినిమాకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈ మూవీపై విడుదలై బ్యాన్ విధించాయి.
Hrithik Roshan -Fighter: అవును హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'బ్యాంగ్ బ్యంగ్', 'వార్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడంతో 'ఫైటర్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తొలిసారి హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణే నటించడం విశేషం. అనిల్ కపూర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మించింది. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించారు. అంతేకాదు ఈ సినిమా మన దేశంలో తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. గాల్లో ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి. ఈ మూవీని పుల్వామాలో మన దేశ సైనికులపై దాడి చేసిన పాకిస్థాన్ ముష్కర మూకలను పీచ మణచడానికి మన సైనికులు పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. పాకిస్థాన్ పై చేసిన రెండో సర్జికల్ స్ట్రైక్. మొదటిసారి పఠాన్ కోట్ దాడి తర్వాత.. రెండోసారి మన సైనికలు వాళ్ల భూభాగంలోకి వెళ్లి చేసిన మెరుపు దాడి. ఈ రెండింటి కంటే మ్యాన్‌మార్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ కూడా దేశ చరిత్రలో నిలిచిపోయింది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే..ఏదో హాలీవుడ్ మూవీస్ చూస్తున్నట్టు ఉంది. ఈచిత్రాన్ని వయాకామ్ 18 సంస్థ మార్‌ఫ్లిక్స్ సంస్థతో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. . ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీగా రానుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేసాయనే చెప్పాలి.
తాజాగా ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే విడుదల చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రాన్ని మన దేశంతో పాటు విదేశాల్లో విడుదల చేస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ మూవీని కొన్ని ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్‌లో పాటు ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా దేశాలు ఈ మూవీ రిలీజ్ పై బ్యాన్ విధించాయి. ఒక్క యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. ఇక హృతిక్ రోషన్.. మరోవైపు ఎన్టీఆర్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నారు. యశ్ రాష్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇంకైవైపు హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేయనున్నారు.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook