Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో మర్చిపోలేని సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఇప్పుడు ఈగల్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు అదే సమయంలో విడుదలైన భగవంత్ కేసరి వంటి సీనియర్ హీరో సినిమాలను సైతం ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కానీ ఈగల్ సినిమా విషయంలో రవితేజ అలాంటి నిర్ణయం తీసుకోరని అందరూ అనుకున్నారు.


అందుకే సంక్రాంతి కి విడుదల కావలసిన సినిమా ని రిపబ్లిక్ డే కి విడుదల చేస్తారేమోనని అభిమానులు సైతం అనుకున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం అందరికీ పెద్ద షాక్ ఇస్తూ సినిమా విడుదల తేదీని జనవరి 13 గా ప్రకటించింది. అంటే అధికారికంగా ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతోంది.


కానీ అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు కూడా విడుదల కి సిద్ధంగా ఉన్నాయి. అన్నీ సినిమాలకి మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. కానీ చూస్తూ ఉంటే రవితేజ ఈగల్ సినిమా చిత్ర బృందం మాత్రం ఈ కాంపిటీషన్ విషయంలో తగ్గేదేలే అన్నట్టు ముందుకు దూసుకు వెళ్తోందని, అందుకే సినిమా విడుదలని వాయిదా వేయకుండా అనుకున్న సమయానికి విడుదల చేయబోతోందని తెలుస్తోంది.


సినిమా మీద వారికి అంత నమ్మకం ఉందని సమాచారం. అందుకే పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నప్పటికీ చిత్ర బృందం మాత్రం సినిమాని వాయిదా వేయాలి అన్న ఆలోచన కూడా చేయటం లేదు. పైగా సంక్రాంతి బరిలోనే సినిమాను దింపాలని చిత్తబృందం ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్య తాపర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మణి బాబు కరణం ఈ సినిమా కి మాటలు అందించారు.


Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  


 


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook