Rebel Star Prabhas Fined: రెబల్ స్టార్ ప్రభాస్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1450 జరిమానా విధించారు. శనివారం (ఏప్రిల్ 16) జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.36 మార్గంలో బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును గమనించి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అది ప్రభాస్ కారుగా గుర్తించారు. కారుకు నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జరిమానా విధించారు. ఎంపీ స్టిక్కర్, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించారు. ఆ సమయంలో హీరో ప్రభాస్ కారులో లేరని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసపెట్టి ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. రెండు, మూడు రోజుల క్రితమే హీరో నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారుకు బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్నందుకు రూ.700 జరిమానా విధించారు. అంతకుముందు, హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు మనోజ్ దర్శకుడు త్రివిక్రమ్‌లకు కూడా బ్లాక్ ఫిల్మ్ కారణంగా జరిమానా తప్పలేదు. 


కాగా, ఫోర్ వీలర్స్‌కు బ్లాక్ ఫిల్మ్ ఉంటే జరిమానా తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సినీ సెలబ్రిటీలు మాత్రం తమ కార్లకు బ్లాక్ ఫిల్మ్‌లతో తిరుగుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి బ్లాక్ ఫిల్మ్‌లను తొలగిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కాకుండా ఇతరుల కార్లపై ఎమ్మెల్యే, ఎంపీ, కార్పోరేటర్ వంటి స్టిక్కర్స్ ఉంటే తొలగిస్తున్నారు.


Also Read: Jio 4G Smartphone: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం.. ఉచితంగా Jio 4G స్మార్ట్ ఫోన్!


Also Read: Jayamma Panchayathi: సుమ నోట 'బూతు' మాట... ఆకట్టుకుంటోన్న 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook