Jio 4G Smartphone: ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. అతి తక్కువ ధరలతో దేశంలో 4G సేవలను ప్రారంభించిన ఈ సంస్థ.. కొద్దికాలంలోనే ఎంతో మంది కస్టమర్ల ఆదరణ పొందింది. ఇప్పుడా వినియోగదారుల కోసం మరొ సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. రాబోతున్న సరికొత్త ప్లాన్ లో ఉచితంగా హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని ఇవ్వడం సహా 4G స్మార్ట్ ఫోన్ ను కూడా ఉచితంగా అందివ్వనుంది.
ఇది జియో అద్భుతమైన ఆఫర్..
ఇప్పుడు రిలయన్స్ జియో ప్రకటించిన ఆ సరికొత్త ప్లాన్ గురించి మీకు చెప్పబోతున్నాం. రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్ ను రెండేళ్ల వ్యాలిడిటీతో అందుబాటులోకి రానుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ సహా 24 GB హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తోంది. అంతేకాకుండా జియోకు సంబంధించిన అన్నీ యాప్స్ లో ఉచిత సబ్ స్క్రిప్షన్ లభించడం సహా ఈ ప్లాన్ లో 4G స్మార్ట్ ఫోన్ కూడా కస్టమర్లు పొందవచ్చు.
ఉచితంగా పొందే జియో 4G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
ఈ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియోకు సంబంధించిన రూ. 2,999 విలువైన స్మార్ట్ ఫోన్ రానుంది. ఇందులో డ్యూయల్ - సిమ్ సదుపాయం కలదు. దీంతో పాటు కింది ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.
డిస్ ప్లే - 2.4-అంగుళాల QVGA
బ్యాటరీ బ్యాకప్ - 1,500mAh బ్యాటరీ
స్టోరేజ్ - 128 GB వరకు SD కార్డ్ సామర్థ్యం
కెమెరా - 0.3 MP (ఫ్రంట్ కెమెరా), 0.3MP (రేర్ కెమెరా)
వీటితో పాటు వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ తో పాటు 18 భాషల వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉంది.
Also Read: Jio Cheapest Plan: జియో సరికొత్త ప్లాన్.. రూ.395 రీఛార్జ్ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook