TS E Challan: రోడ్డు ప్రమాదాలు నివారించటానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయిప్పటికీ రోడ్డు ప్రమాదాలు నివారణలో ఎలాంటి ఆలోచనలు పని చేయయకపోవటంతో హైదరాబాద్ పోలీసులు డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆకతాయిలు వాహనాలపై ఇష్టారీతిన స్టిక్కర్లు వేసుకొని రోడ్డుపై నిబంధనలు పాటించకుండా తీరుగుతున్న నేపథ్యంలో.. ఆకతాయిలు చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీసులు  టోలి చౌకి ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు, నకిలీ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములతో తిరుగుతున్న వారిని గుర్తించి వారికి చలానాలు విధిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనిఖీలు చేస్తున్న సమయంలో నిన్న మంగళవారం పిల్లర్ నంబర్ 105 వద్ద బ్లాక్ ఫిలిం తో ap 39 hp 0319 వాహనం దూసుకొచ్చింది. అది గమనించిన టాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపి చూడగా.. అందులో టాలీవుడ్ హీరో మంచు ప్రయాణిస్తున్నట్లు గమనించారు. నిబంధనల ప్రకారం, మంచు మనోజ్ కారుకు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించి, వాహనం పై చలాన్ విధింనట్లు ఎస్ .ఐ .సుధాకర్ గారు తెలిపారు. 


అదే విధంగా 3 రోజుల క్రితం శనివారం ఖైరతాబాద్‌ పరిధిలో ఫిలింనగర్‌ కూడలి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. హీరో అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లను తనిఖీ చేసిన పోలీసులు వారి కార్లకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించారు. 


జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం, హీరో కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ వాహనాలు అటుగా వెళ్తుండగా.. నిబంధనల ప్రకారం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించి రూ.800 చలాన్ విధించామని, నిబంధనలు పాటించని 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అంతేగాకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు కూడా బ్లాక్ ఫిలిం తొలగించి, చలాన్ విధించినట్టు తెలిపారు. 


Also Read: Ghani Pre Release Event: గని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్!


Also Read: Huzurnagar Election: హైకోర్టులో మరో స్టే తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ 26 వరకు అనుమతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook