Hyper Aadi Anchor Sowmya బుల్లితెరపై హైపర్ ఆది వేసే పంచ్‌లు ప్రస్తుతం అందరూ మిస్ అవుతున్నారు. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో ఆది సందడి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ షోకు మళ్లీ గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య మూడు నెలలు గ్యాప్ ఇచ్చిన ఆది.. జబర్దస్త్ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సినిమాలు, బుల్లితెరపై షోలతో బిజీగా ఉండటంతోనే ఇలా జబర్దస్త్ షోకు డుమ్మా కొడుతోన్నట్టుగా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందరి మీద పంచులు వేసే ఆది మీదే పంచులు వేసి బుల్లితెర నటి సౌమ్య అందరినీ ఆకట్టుకుంది. భలే మంచి రోజులు అనే ఈవెంట్‌లో ఆది మీద కౌంటర్లు వేసి సౌమ్య మెప్పించింది. అయితే ఆ టైంలో జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్య వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అనసూయ బయటకు వెళ్లడంతో యాంకర్‌ల విషయంలో కొరత స్పష్టంగా కనిపించింది. జబర్దస్త్ యాంకర్‌గా ఎవరెవరి పేర్లో వినిపించాయి. కానీ చివరకు సౌమ్య ఎంట్రీ ఇచ్చింది.


 



జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్యకు మంచి క్రేజ్ వచ్చింది. మొదట్లో తెలుగు రాదంటూ ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు యాంకర్ సౌమ్య అందాలకు, ఆమె వాయిస్‌కు అందరూ పడిపోతోన్నారు. రాను రాను ఆమెకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. సౌమ్య తన మీద వచ్చే ట్రోలింగ్‌కు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సమాధానం ఇచ్చింది. తనకు తెలుగు రాదని ట్రోల్ చేస్తున్నారా? అంటూ ఓ డైలాగ్‌ను అనర్గళంగా చెప్పేసింది. భలే మంచి రోజులు ఈవెంట్లో ఆదికే పంచులు వేసిన దాన్ని అంటూ తన క్రేజ్‌కు కారణమైన ఎపిసోడ్‌ను గుర్తు చేసింది.


అలా మొత్తానికి సౌమ్య మాత్రం పర్మినెంట్ యాంకర్‌గా ఫిక్స్ అయ్యేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక ఆదితో సౌమ్య ట్రాక్ కూడా బాగానే సెట్ అయింది. కానీ మధ్యలో ఆది మాత్రం ఇలా బ్రేకులు ఇస్తూనే ఉన్నాడు. సౌమ్య తన క్రేజును పెంచుకుంటూనే పోతోంది.


Also Read : Pooja Hegde : సమంత, రష్మిక, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా మారక ముందు చేసిన పనులివే


Also Read : Anchor Varshini Photoshoot : అందాల ఆటంబాంబ్.. టాప్ లేపేసిన యాంకర్ వర్షిణి.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook