Dhee 15 Championship Battle Latest Promo బుల్లితెరపై హైపర్ ఆదికి తిరుగులేదు. ఆది పంచ్‌లకు కౌంటర్లు వేసే వారు చాలా తక్కువ. ఇక ఇప్పుడు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు అంటే అందరికీ ఆదినే గుర్తుకు వస్తాడు. ఇటు శ్రీదేవీ డ్రామా కంపెనీ, అటు ఢీ షోలను చేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో జబర్దస్త్ షోకు వస్తున్నాడు.. వెళ్తున్నాడు. అయితే అతను చేసే షోల్లో జడ్జ్‌లతో యాంకర్లతో పులిహోర కలిపేస్తుంటాడు హైపర్ ఆది. ఢీ షోలో అయితే వచ్చిన ప్రతీ జడ్జ్‌తో ట్రాక్ కలిపేందుకు ఆది ప్రయత్నిస్తుంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జబర్దస్త్ షోలో అప్పుడు అనసూయతో ఇప్పుడు యాంకర్ సౌమ్యతో ఆది ట్రాక్ నడిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక జబర్దస్త్ డైరెక్షన్ టీం ఆదితోనే ఇలాంటి ట్రాకులను ఎక్కువగా ప్లాన్ చేస్తుంటుంది. ఢీ షోకు అయితే ఆదియే స్క్రిప్ట్ రైటర్. అందుకే అంతా కూడా ఆది కేంద్రంగానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రదీప్ మీద అయినా, కో యాంకర్ల మీద అయినా, టీం లీడర్ల మీద అయినా, చివరకు జడ్జ్‌ల మీద అయినా ఆది పంచ్‌లు వేస్తుంటాడు.


 



తాజాగా అత్తారింటికి దారేది సినిమా టైపులో సీన్ రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు ఆది. క్లైమాక్స్ రైల్వే స్టేషన్ సీన్‌లాంటి చేసేందుకు ప్రయత్నించాడు ఆది. శ్రద్దాతో ఒంటరిగా ఓ అర్దంంట మాట్లాడాలంట.. అందుకే ఈ స్టేజ్‌ను ఖాళీ చేయించు అని జెస్సీతో ఆది అంటాడు. అత్తారింటికి దారేది స్టైల్లో చేద్దామని అనుకున్నాడు. కానీ చివరకు జెస్సీ గాలి తీసేశాడు.


అందరినీ పంపించమని అంటాడు.. గణేష్ మాస్టర్‌కు ఫ్లైట్ వేసి బయటకు పంపించి అంటాడు. మరి శ్రద్దాను? అని జెస్సీ అడుగుతాడు. మాట్లాడేదే శ్రద్దాతో అయితే.. ఆమెకు బయటకు పంపిస్తే ఎవరితో మాట్లాడాలిరా అంటూ జెస్సీని కొట్టేస్తాడు ఆది. ఇక ఇదంతా చూస్తూ శ్రద్దా దాస్ తెగ నవ్వేస్తుంటుంది.


Also Read : Laththi Telugu Movie Review : విశాల్ లాఠీ రివ్యూ.. రొటీన్ రొడ్డకొట్టుడు కొట్టిన లాఠీ  


Also Read : Sitara Ghattamaneni Pics : అదరగొట్టేసిన సితార.. మొదలెట్టేసిన మహేష్ బాబు కూతురు.. క్యూట్ పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook