Jabardasth New Anchor : జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. యాంకర్ మంజూష అని కొంత మంది.. బిగ్ బాస్ స్రవంతి అని ఇంకొందరు ఇలా ఎవరికి నచ్చినట్టుగా రాసుకొచ్చేశారు. అయితే రష్మీనే రెండు షోలకు వాడేశారు. కానీ ఇప్పుడు రష్మీ తన సినిమా పనులతో బిజీగాఉంటోంది. రెండు షోలను మెయింటైన్ చేయలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే అర్జెంటుగా కొత్త యాంకర్‌ను పట్టినట్టుంది. కానీ ఆమె యాంకర్‌ అని ప్రేక్షకుడు అనుకోవాలి తప్పా.. ఆమె మాత్రం యాంకరింగ్ చేయలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమెకు ఒక్క ముక్క తెలుగు సరిగ్గా మాట్లాడటం రావడం లేదు. అయినా తెలుగు మాట్లాడే వాళ్లు తెలుగు యాంకర్లుగా ఉంటున్నారా? రష్మీ మొదట్లో ఎలా ఉండేదో తెలియదా? అని అంటే మాత్రం చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు జబర్దస్త్ షోకు కొత్తగా వచ్చిన సౌమ్య రావ్ అనే నటి.. సీరియల్స్‌తో బిజీగానే ఉంటోంది. తమిళ సీరియల్స్‌లో నటించింది. తెలుగులోనూ ఓ సీరియల్ చేస్తోంది. అయితే ఇప్పుడు జబర్దస్త్ షోకు హోస్ట్‌గా వచ్చింది


 



జబర్దస్త్ షోకు యాంకర్‌గా రాక ముందే.. ఆమె భలే మంచి రోజులు అనే ఈవెంట్లో సందడి చేసింది. ఆ ఈవెంట్లో ఆదిపై బాగానే పంచులు వేసింది. ఆది సైతం ఆమెతో పులిహోర కలిపేశాడు. రాం ప్రసాద్ మీద కూడా బాగానే పంచులు వేసింది. ఆమె కామెడీ టైమింగ్ బాగానే అనిపించింది. కానీ ఆమెకు అంతగా తెలుగు రాదు. వచ్చిన భాష, తెలిసిన పదాలతో మ్యానేజ్ చేసింది.


కానీ ఇప్పుడు మాత్రం యాంకరింగ్ చేయడానికి వచ్చింది. కానీ ఇంట్రడక్షన్, స్కిట్ల ఇంట్రడక్షన్ కూడా చెప్పడానికి రాలేదు. సౌమ్య బాగానే తడబడింది. అయినా జనాలు మాత్రం ఇవేవీ చూడటం లేదు. సౌమ్య అందంగానే ఉంది.. కామెడీ టైమింగ్ బాగుందని అంటున్నారు. యాంకరింగ్ చేయడానికి, స్కిట్లో చేయడానికి తేడా ఉందనే విషయాన్ని తెలుసుకోలేకపోతోన్నారు.


ఇవన్నీ ఇలా పక్కన పెడితే సౌమ్యతో మాత్రం ఆది పులిహోర కలిపేస్తున్నాడు. తనకు అలవాటైనట్టుగా రెచ్చిపోతోన్నాడు. కానీ ప్రోమో చివర్లో మాత్రం ఆది హైట్ మీద కామెంట్ చేసింది. తన కంటే తక్కువ హైట్ ఉన్నాడు.. కుదురదంటూ సైగలు చేసింది సౌమ్య. మరి ఈ అమ్మడు ఎన్ని రోజులు యాంకర్‌గా ఉంటుందో చూడాలి.


Also Read : Rishab Shetty Kantara : కాంతారా కథను ముందుగా ఆ హీరోకు చెప్పాడట.. రిషభ్ శెట్టి ఇంట్రెస్టింట్ కామెంట్స్


Also Read : Tabu Casting Couch : టబుకి కూడా అలాంటివి తప్పలేదట.. బర్త్ డే స్పెషల్.. నాటి వార్తలు తెరపైకి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook