Bigg boss 5 telugu: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(hyper aadi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ టైమింగ్ పంచులతో బుల్లితెర అభిమానులను అలరిస్తుంటాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని కామెడీ చేయడంలో హైపర్ ఆది దిట్ట. అలా అతడు స్టేజ్‌పై ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆది ప్రముఖ రీయాలిటీ షో తెలుగు బిగ్‌బాస్‌ 5(bigg boss 5 telugu)కి అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవరాత్రి ఉత్సవాలు పేరుతో ఆదివారం బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు ఈ షోకు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరోహీరోయిన్‌ అఖిల్‌(Akhil), పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్‌, నాట్యం నటి వచ్చి తమ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో అలరించారు. దీనితో పాటు కాస్తా కామెడీ టచ్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌(BiggBoss) నిర్వహకులు ఆదిని తీసుకువచ్చారు. పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి వచ్చిన ఆది అందరిని ఓ రేంజ్‌లో నవ్వించాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్‌ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్‌ చేశాను అంటూ వారి చరిత్ర అంతా విప్పాడు.


Also read: Kajol Durga Puja : దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేసిన బాలీవుడ్ నటి కాజోల్‌


హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని బయటపెడుతూనే తనదైన శైలిలో హౌజ్‌మేట్స్‌పై పంచ్‌లు, సటైర్లు వేశాడు. అలా ఈ షోలో గెస్ట్‌గా తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆది ఉన్నంత సేపు బిగ్‌బాస్‌ ప్రేక్షకులంతా కూడా ఫుల్‌గా నవ్వేసుకున్నారు. అంతలా వినోదం పంచిన ఆది భారీగానే రెమ్యునరేషన్‌ అందుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. కాగా గతేడాది కూడా దసరా సందర్భంగా బిగ్‌బాస్‌ 4 సీజన్‌కు సమంత హోస్ట్‌గా రాగా అదే ఎపిసోడ్‌కు ఆది గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook