Naga Chaitanya on His Divorce with Samantha: స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులపై అక్కినేని యువ హీరో నాగ చైతన్య స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారంతో విసిగెత్తిపోయానని, ఒక్కోసారి చాలా చిరాకుగా ఉంటుందన్నారు. పరస్పర అంగీకారంతో సమంత తన నుంచి విడిపోయిందని, దాని గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని చై తెలిపారు. చై ప్రస్తుతం ఆగస్ట్‌ 11న రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహ జీవితంపై మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నా కెరీర్‌లో సినిమా విజయాల కంటే ఎక్కువగా నా వ్యక్తిగత జీవితం వార్తలో నిలవడం చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఏదో ఒక ప్రకటన రూపంలో చెపుతాను. మంచైనా, చెడైనా సరే.. నా జీవితం గురించి అందరితో పంచుకోవాల్సిన విషయాలను చెప్పాల్సినంత వరకూ చెబుతా. విడాకుల విషయంలో కూడా నేను, సమంత ఇదే చేశాం. ఇద్దరం ఏం చెప్పాలనుకున్నామో చెప్పేశాం' అని నాగ చైతన్య అన్నారు. 


'సమంత, నేను విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ముందుకు పోవాలనుకున్నాం. ఇదే విషయాన్ని అందరికి చెప్పాం. అంతకు మించి మా మధ్య జరిగిన ఏ విషయం కూడా అందరికీ తెలియజేయాలనుకోవడం లేదు. నా జీవితంలో ఏం జరిగిందో నా ఫ్యామిలీ, సన్నిహితులకు తెలుసు. ఒక నటుడిగా నా వ్యక్తిగత జీవితం గురించి కాకుండా.. నా సినిమాల గురించే అందరూ మాట్లాడుకోవాలని భావిస్తున్నా. సినిమా  రంగంలో ఉన్నప్పుడు నటీనటుల వ్యక్తిగత జీవితంపై అందరూ ఫోకస్‌ చేస్తుంటారు. అది నిజంగా దురదృష్టకరం' అని చై పేర్కొన్నారు.  


'ఇక ఓ వార్తను మరో వార్తనే రీప్లేస్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో నా గురించి జరుగుతోన్న ప్రచారాలు అన్ని తాత్కాలికమైనవి. ఈ వార్తలపై నేను స్పందిస్తే.. మరిన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను సోషల్ మీడియా వార్తలను  పట్టించుకోవడం లేదు' అని చెప్పుకొచ్చారు. సమంతో కలిసి నటిస్తారా? అనే ప్రశ్నకు నవ్వేసిన చైతన్య.. అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందని, అది జరుగుతుందో లేదో తనకు తెలియదన్నారు. 7 ఏళ్లు ప్రేమలో ఉన్న సామ్‌-చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. 


Also Read: IND Playing 11 vs WI: స్టార్ ప్లేయర్ ఔట్.. సెంచరీ హీరో ఇన్! వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత జట్టు ఇదే  


Also Read: CWG 2022: భారత దేశం గర్వపడేలా చేశాడు.. వెయిట్‌లిఫ్టర్ షూలిపై ప్రధాని ప్రశంసలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook