Shreyas Iyer out and Deepak Hooda in for IND vs WI 2nd T20I: తొలి టీ20లో వెస్టిండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న భారత్.. రెండో టీ20కి సిద్ధమైంది. సెయింట్ కిట్స్ పార్క్‌లో ఈరోజు జరిగితే రెండో మ్యాచులో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్ స్వీప్‌కు బాటలు వేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు భారీ హిట్టర్లు ఉన్న విండీస్ ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
తొలి టీ20లో గెలిచిన జట్టును మార్చేందుకు భారత టీమ్ మేనేజ్‌మెంట్ సుముఖంగా లేకున్నా.. ఓ మార్పు మాత్రం జరిగే అవకాశం ఉంది. తొలి టీ20లో స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యార్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. నాలుగు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు. దాంతో సెంచరీ హీరో దీపక్ హుడాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రిషబ్ పంత్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి నిరాశపరిచినా.. కీపర్ కాబట్టి అతడిని పట్టాన పెట్టే అవకాశం లేదు. ఒకవేళ పెడితే పంత్ స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తొలి టీ20లో రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో కూడా వీరిద్దరే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆపై శ్రేయస్ స్థానంలో దీపక్ హుడా దాదాపు ఆడడం ఖాయం. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు మిడిల్ భారాన్ని మోయనున్నారు. ఫినిషర్ దినేష్ కార్తీక్, ఆల్‌రౌండర్ రవీంద్రా జడేజా పక్కాగా తుది జట్టులో ఉంటారు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు.
తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్రాజడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్.
Also Read: Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా
Also Read: Shamshabad Road Accident: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook