IBomma Restarted its Services in India: గత కొంతకాలంగా ఐ బొమ్మ చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికగా విడుదలైన సినిమాలను, వెబ్ సిరీస్ లను హై క్వాలిటీ తో ఈ వెబ్సైట్ ప్రేక్షకులకు అందిస్తోంది. కేవలం తెలుగు వెబ్ సిరీస్, సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ వెబ్సైట్ తెలుగు సినీ ప్రేక్షకులకు, సినీ ప్రియులకు చాలా సుపరిచితం. తొలుత తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అందుకే ఐ బొమ్మ వెబ్సైట్ పూర్తిగా నిలిపివేస్తున్నామని ఒక ప్రకటన జారీ చేసి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ తర్వాత నెటిజనుల నుంచి పెద్ద ఎత్తున ఐ బొమ్మ సైట్ కి సపోర్ట్ లభించడంతో తాము నిలిపివేయడం లేదని ఆ సైట్ మరో ప్రకటన జారీ చేసింది. కొన్నాళ్ల తర్వాత ఐ బొమ్మ వెబ్సైట్లో కేవలం చివరి 30 సినిమాలు మాత్రమే చూసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. అంటే అంతకుముందు పాత సినిమాలు కూడా వెతికి చూసే అవకాశం కల్పించారు. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా పేరుతో వెతికి సినిమా చూసే అవకాశం ఉండేది.


కానీ దాన్ని కేవలం 30 సినిమాల వరకే కుదించారు. తర్వాత ఏకంగా ఇండియాలో తమ సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించి ఐ బొమ్మ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఆ సైట్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అయినా వీడియోలు ప్లే అవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఐ బొమ్మ ఒక శుభవార్త చెప్పింది. ఇండియాలో కూడా తమ సేవలు మళ్లీ కొనసాగిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది.


అయితే కొన్నాళ్ల క్రితం నిలిపివేసిన డౌన్లోడ్ ఆప్షన్ ని కూడా ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించింది. దీంతో ఇప్పుడు వీడియోలను లేదా సినిమాలను డౌన్లోడ్ చేసుకుని కూడా చూసే అవకాశం కల్పిస్తోంది. అలాగే గతంలో చివరి 30 సినిమాలు మాత్రమే చూసే అవకాశం కల్పించగా ఇప్పుడు పాత సినిమాలు వెతికి చూసుకునే అవకాశం కల్పించే విధంగా సెర్చ్ బార్ ని కూడా ఎనేబుల్ చేసింది.


Also Read: Soundarya Rajinikanth Baby Boy: మరోసారి తాతైన రజనీకాంత్.. మళ్లీ మనవడే!


Also Read: Ram Gopal Varma comments: రేపు మీకు ఈ దుస్థితి తప్పదు..మన మీద మనమే ఉమ్మేసుకున్నట్టే.. టాలీవుడ్ హీరోలపై వర్మ సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి