Ram Gopal Varma comments: రేపు మీకు ఈ దుస్థితి తప్పదు..మన మీద మనమే ఉమ్మేసుకున్నట్టే.. టాలీవుడ్ హీరోలపై వర్మ సంచలనం!

Ram Gopal Varma Sensational comments on Telugu Heros Over Krishnam Raju Death: అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 12, 2022, 09:12 AM IST
Ram Gopal Varma comments: రేపు మీకు ఈ దుస్థితి తప్పదు..మన మీద మనమే ఉమ్మేసుకున్నట్టే.. టాలీవుడ్ హీరోలపై వర్మ సంచలనం!

Ram Gopal Varma Sensational comments on Telugu Heros Over Krishnam Raju Death: అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన  క్రమంలో ఆ విషయం మీద ఉదయం నుంచి ఎలాంటి సంతాప సందేశాలు సోషల్ మీడియా వేదికగా గాని నేరుగా గాని ప్రకటించని రాంగోపాల్ వర్మ అర్ధ రాత్రి ఒంటి గంట తర్వాత వరుస ట్వీట్లు చేస్తూ టాలీవుడ్ ను టార్గెట్ చేశారు.

భక్తకన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలు అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినీ పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ చేసిన ఆయన కృష్ణ గారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్య కి, ప్రభాస్ కి, మహేష్ కి, పవన్ కళ్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ ఫైరయ్యారు.

మనసు లేకపోయినా ఓకే కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం, కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుందని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది అంటూ గతంలో షూటింగ్స్ నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఈ విషయం మీద టాలీవుడ్ సినీ పెద్దలు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే సినిమా షూటింగ్స్ పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. బాలకృష్ణ వంటి వారు టర్కీ వెళ్లి మరి షూటింగ్ జరుపుతున్నారు. మరి వర్మ వ్యాఖ్యలను టాలీవుడ్ సీరియస్ గా తీసుకుంటుందా? సీరియస్ గా తీసుకుని షూటింగ్ నిలిపి వేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Also Read: SIIMA 2022 Telugu Winners List: గత్తర లేపిన పుష్ప.. తగ్గేదేలే అంటూ అవార్డుల వేట!

Also Read: Krishnam Raju Funeral: చివరి నిముషంలో మారిన కృష్ణంరాజు అంత్యక్రియల స్థలం.. ఎందుకు మార్చారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News