Icon Star Allu Arjun fan sensational comments on Pushpa Movie : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తోన్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ (Red sandalwood smuggling) నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్‌ రష్మిక. డిసెంబర్‌ 17న పుష్ప ది రైజ్‌ పేరుతో ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పుష్ప ట్రైలర్‌ (Pushpa Trailer‌) రిలీజ్ అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట.. ఫ్యాన్స్ అంతా ట్రైలర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణంలో పుష్ప టీమ్ (Pushpa Team‌)సడెన్‌గా షాకిచ్చింది. సాంకేతిక సమస్యల వల్ల ట్రైలర్‌ అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్‌ను పుష్ప టీమ్ నిరాశ పరిచింది. మొత్తానికి ట్రైలర్‌ను తర్వాత రిలీజ్ చేశారు.


ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ట్రైలర్‌ కోసం ఎదురు చూసిన‌ ఫ్యాన్స్.. ట్రైలర్‌‌ చూశాక కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కొంత మంది ఫ్యాన్స్...తమ అంచనాలు తగ్గ విధంగా ట్రైలర్ లేదంటూ అప్ సెట్ అయ్యారు. మరికొందరేమో బన్నీ (Bunny) ఇరదీశాడు అంటూ పోస్ట్స్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో పుష్ప ట్రైలర్‌‌పై చాలా కామెంట్స్ వచ్చాయి. 



Also Read : Bipin Rawat death news: బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్‌లో సర్జికల్ స్ట్రైక్స్


ఇక తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్ రాజేశ్ బన్నీ అనే ట్విట్టర్‌‌ ఖాతాతో.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.. "ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది..ఇంకా నా వల్ల కాదు. ఇన్ని రోజులు మీకు చాలా గౌరవం ఇచ్చి ట్వీట్ వేశాను. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు.. ఒట్టు వేసి ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్పను ట్విట్టర్‌‌కు గుడ్ బై.. " అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్ తాజాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి బన్నీ ఫ్యాన్ ట్వీట్ పై పుష్ప మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.



 


Also Read : Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook