Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి

Bipin Rawat Helicopter crash in Tamil Nadu : చెన్నై: డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు. ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో బిపిన్ రావత్ మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన రావత్‌ని ఆస్పత్రిలో చేర్పించి బతికించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

Last Updated : Dec 8, 2021, 06:41 PM IST
  • Bipin Rawat chopper crash: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి చెందారు. Army Helicopter crashed in Tamil Nadu: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్.. చాపర్‌లో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక
Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి
Live Blog

Bipin Rawat death news : చెన్నై: డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు. ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో బిపిన్ రావత్ మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన రావత్‌ని ఆస్పత్రిలో చేర్పించి బతికించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

Bipin Rawat Helicopter crash in Tamil Nadu : డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన కుటుంబంతో పాటు పలువురు సీనియర్ డిఫెన్స్ స్టాఫ్ అధికారులతో వెళ్తున్న ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీకి సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. నీలగిరి అటవీ ప్రాంతంలోని కూనూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అత్యవసర సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇంటికి చేరుకుని రావత్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బిపిన్ రావత్ నివాసంలోనే 10 నిమిషాల పాటు ఉన్న రాజ్‌నాథ్ సింగ్ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also read : Bipin Rawat Chopper Crash : బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

IAF Mi-17V5 హెలీక్యాప్టర్‌లో తమిళనాడులోని సూలూరు వైమానిక స్థావరం నుంచి తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్‌కి బయల్దేరి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Also read : Bipin Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదంపై సందేహాలు

ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో రక్షణ బలగాల అధిపతి బిపిన్ రావత్‌కి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బిపిన్ రావత్ ఆరోగ్యం పరిస్థితి (Bipin Rawat biography) విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

Also read : Bipin Rawat Helicopter Crash Live Updates CDS Bipin Rawat Biography Birth Education Family Military Career : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ జీవితమంతా ఆర్మీలోనే.. ఎన్నో రికార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

8 December, 2021

Trending News