Allu Arjun on RRR Movie: భారీ అంచనాల నడుమ విడుదలై.. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీపై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ అద్భుతమైన మూవీ అంటూ ప్రశంసించిన అల్లు అర్జున్... ఆర్ఆర్ఆర్ టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మనమంతా గర్వపడే రాజమౌళి విజన్‌ అంటే తనకు చాలా గౌరవమని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పెర్ఫామెన్స్‌ని అల్లు అర్జున్ ఆకాశానికెత్తేశారు. 'నా బ్రదర్ రామ్ చరణ్ కిల్లర్ అండ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌కి గర్వంగా ఫీలవుతున్నాను. నా బావ, పవర్ హౌస్ తారక్ అద్భుత నటనకు నా ప్రేమను తెలియజేస్తున్నాను.' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అజయ్ దేవగణ్, అలియా భట్‌ల నటనను అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌కు, నిర్మాత డీవీవీ దానయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వపడే సినిమా తీసినందుకు కృతజ్ఞతలు అని... ఇది కిల్ల'ర్ఆర్ఆర్' అని పేర్కొన్నారు.


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ నిన్న (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్నిచోట్ల ఈ సినిమా పాజిటివ్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. 




Also read: Samantha: పుకార్లు, విమర్శలు వచ్చినా.. సమంత ఇంకా అతనితోనే ఉంది!!


Also read: RRR OTT Streaming: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎందులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook