Allu Arjun-Rajamouli: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగిన అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంపై ఇప్పుడు విపరీతంగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో గానీ.. లేదా వచ్చే ఏడాది ఆరంభంలోగానీ విడుదలయ్యే అవకాశముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న బన్నీ తదుపరి సినిమా ఎవరితో తీస్తాడనే విషయంపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన లేదు. కానీ టాప్​ డైరెక్టర్ల సినిమాలు క్యూలో ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది.


తాజాగా అల్లు అర్జున్​- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తీసిన 'ఆర్​ఆర్​ఆర్​' త్వరలో విడుదల కానుంది. అయితే రాజమౌలి ఇప్పటికే మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా వెళ్లడైంది. దీనితో మహేశ్​-రాజమౌళి కాంబోలో మూవీ పూర్తయిన తర్వాతే బన్నీతో సినిమా చేసే అవకాశాలున్నాయనేది సిని వర్గాల నుంచి వినిపిస్తున్న విషయం.


ఇదిలా ఉండగా.. బన్నీ కూడా బాలీవిడ్​ దర్శకత దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీతో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆఫీస్​కు బన్నీ స్వయంగా వెళ్లి కలవడం ఇందుకు ఊతమిస్తోంది. అయితే ఇది సినిమా కోసమేనా? అనేది తెలియరాలేదు. మొత్తానికి బన్నీ మాత్రం మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నాడనేది మాత్రం నిజం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.


Also read: Ananya Pandey Photos: సన్ సెట్ లో సముద్రపు ఒడ్డున రౌడీ హీరోయిన్ హల్ చల్!!


Also read: Prabhs-Maruthi Combo: ప్రభాస్ తో జతకట్టనున్న బేబమ్మ..?? ప్రభాస్ - మారుతి కాంబోలో ఛాన్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook