Prabhs-Maruthi Combo: ప్రభాస్ తో జతకట్టనున్న బేబమ్మ..?? ప్రభాస్ - మారుతి కాంబోలో ఛాన్స్!

ప్రభాస్ - మారుతి కాంబో గురించి ఒక ఆసక్తికర విషయం ఒకటి సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ అంటూ వార్త హల్ చల్ చేస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 06:53 PM IST
  • ప్రభాస్ - మారుతి కాంబో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి
  • స్పీడ్ పెంచిన హీరోయిన్ కృతి శెట్టి
  • వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూరు భామ
Prabhs-Maruthi Combo: ప్రభాస్ తో జతకట్టనున్న బేబమ్మ..?? ప్రభాస్ - మారుతి కాంబోలో ఛాన్స్!

Prabhs - Maruthi Combo: ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ వస్తున్నా.. సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హీరో ప్రభాస్ సినిమాల స్పీడ్ ను పెంచేసాడు. ఇప్పటికే 'ఆదిపురుష్', సలార్, షూటింగ్ లో ఉండగానే 'స్పిరిట్' గురించి వార్తా బయటకి వచ్చింది. అయితే ప్రభాస్ - మారుతి కాంబో గురించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. 

ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం 'ఆదిపురుష్' టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా... సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ దశలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలోనే 'స్పిరిట్' మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. వీటితోపాటు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతోందని సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ రౌండ్లు కొడుతోంది.

ప్రభాస్ - మారుతి కాంబో మూవీలో కథానాయికగా 'ఉప్పెన' భామ కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనుండగా.. ఒక హీరోయిన్‌గా బేబమ్మ ఎంపికైందని సమాచారం అందుతోంది. మరో హీరోయిన్‌గా.. మాళవికా మోహనన్ నటిస్తోంది. ఇంకో హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 'రాజా డీలక్స్' అనే టైటిల్ రిజిస్టర్ చేశారని వార్తలొచ్చాయి. అయితే... ఆ టైటిల్ మార్చబోతున్నారని తెలుస్తోంది.

ఉప్పెన , శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి.. ప్రస్తుతం ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ప్రభాస్ జోడీగా ఎంపికవటమంటే కృతి మామూలు రేంజ్‌లో లేదనే అనుకోవాలి.

Also Read: Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పు..? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

Also Read: PM Kisan 11th Instalment: పీఎం కిసాన్ యోజన 11వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News