IIFA 2022 Awards: భారతీయ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో 'ఐఫా' (IIFA) అవార్డ్స్ ఒకటి. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' అవార్డుల కార్యక్రమం జూన్ 3, 4 తేదీల్లో అబుదాబిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఐశ్వర్యారాయ్‌, రెహమాన్, జెనీలియా తదితరులు పాల్గొని సందడి చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమానికి కండలవీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, మనీష్ పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహారించారు. సారా అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, అనన్య పాండే మరియు నోరా ఫతేహీలు తమ డ్యాన్స్ లతో ఇరగదీశారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ (vicky kaushal), ఉత్తమ నటిగా కృతిసనన్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'షేర్షా' ఎంపికైంది. 



విజేతలు వీరే..(IIFA 2022 Awards full winners list): 
ఉత్తమ చిత్రం: షేర్షా
ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్‌ (షేర్షా)
ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్‌ (సర్దార్‌ ఉద్దమ్‌)
ఉత్తమ నటి: కృతిసనన్‌ (మిమీ)
ఉత్తమ సహాయనటుడు: పంకజ్‌ త్రిపాఠి (లూడో)
ఉత్తమ సహాయనటి: సాయి తమ్హాంకర్‌ (మిమీ)
ఉత్తమ నటుడు (డెబ్యూ): అహాన్‌శెట్టి (తడప్‌)
ఉత్తమ నటి (డెబ్యూ): శర్వరి వాఘ్ (బంటీ ఔర్‌ బబ్లీ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌ (ఆత్రంగి రే), తనిష్క్ బాగ్చి,జస్లీన్ రాయల్ (షేర్షా)
ఉత్తమ లిరిక్స్‌: కౌసర్ మునీర్ (83)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): జుబిన్ నౌటియల్ (రతన్ లంబియన్ సాంగ్-షేర్షా)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): అసీస్ కౌర్ (షేర్షా)
ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ: అనురాగ్‌ బసు (లూడో)
ఉత్తమ అడాప్టెడ్‌ స్టోరీ: కబీర్‌ ఖాన్‌, సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ (83)


Also Read: Indian Box Office: రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. ఈ ఏడాది కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook