IIFA Awards 2024: మెగాస్టార్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఔట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ పురస్కారం అందుకున్న చిరు..
IIFA Awards 2024: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఐఫా 2024 (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డులో భాగంగా ఈయన ఔట్‌స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు.
IIFA Awards 2024: ఇటీవలె గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్‌ను ఐఫా అవార్డు 2024 కూడా వరించింది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఐఫా ప్రదానోత్సవం సినీరంగంలోనే ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణిస్తారు. ఇక ఉత్తమ స్టార్‌గా నేచురల్ స్టార్ నాని, గోల్డెన్ లెగసీ అవార్డు బాలయ్య బాబు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ప్రముఖ స్టార్ హిరోయిన్ సమంతను కూడా వరించింది.
ఇటీవలె గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడ స్థానం సంపాదించుకున్నాడు చిరు. ముఖ్యంగా ఆయన నటించిన 156 సినిమాు 24 వేల డ్యాన్స్ స్టెప్పులు, 537 పాటలకు గాను ఆయన ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను మరో ప్రతిష్టాత్మక ఐఫా 2024 అవార్డు కూడా వరించింది. ఈ అవార్డును బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ చేతుల మీదుగా అందుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ అవార్డులకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఐఫా వేడుకల్లో చిరంజీవితోపాటు వెంకటేష్, బాలకృష్ణతోపాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంటూ బాలయ్య, వెంకటేశ్‌లు సైతం చిరును కొనియాడారు.
ఇదీ చదవండి: దేవర రిలీజ్.. ఆ సీన్ చూసి ఏంటీ ఘోరం దయచేసి ఆపండి అంటూ ప్రముఖ నటి ఫైర్..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు చిరంజీవిని వరిస్తే..
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రయదర్శన్ సొంతం చేసుకున్నారు.
గోల్డెన్ లెగసీ - బాలకృష్ణ
ఉత్తమ నటుడు నాని
ఉమెన్ ఆఫ్ ది ఇయర్ సమంత
ఉత్తమ విలన్ షైన్ టామ్ (దసరా)
బెస్ట్ ఫోటోగ్రాఫీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
దక్కించుకున్నారు.
ఇదీ చదవండి: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ఫైర్..
అయితే, దుబాయ్ వేధికగా జరుగుతున్న ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి అందరు ప్రముఖులు వెళ్లారు. ఇక ఐఫా బాలివుడ్ అవార్డులకు హీరో షారుఖ్ ఖాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సౌత్ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్‌కు రానా దగ్గుపాటి, హీరో తేజా సజ్జా హోస్ట్ చేస్తున్నారు. ఈ వేడుకలకు తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మళయాల ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు. ఇక చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడానికి తన సతీమణి సురేఖతోపాటు హాజరయ్యారు.
ఇక చిరంజీవి నటించిన చివరి చిత్రం గత ఏడాది విడుదలైన భోళా శంకర్ ప్రస్తుతం చిరు విశ్వభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట డైరక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇక చిరంజీవి సరసన ప్రముఖ హిరోయిన్ త్రిష నటిస్తున్నారు. విశ్వభర సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter