IIFA Awards 2024 Nominations: ఈ ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల కోసం.. సినిమా లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి అబు దాబి.. ఈ వేడుకకు వేదిక కానుంది. 24వ ఐఫా వేడుకలు అబుదాబిలోని..యస్ ఐల్యాండ్ లో సెప్టెంబర్ 27 నుండి 29 వరకు జరగబోతునున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవార్డులతో పాటు సినిమా సెలబ్రిటీలతో సందడిగా సాగే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ లుగా.. వ్యవహరించనున్నారు. దీని గురించి నిర్వాహకులు ఆల్రెడీ ప్రకటించేశారు. 


ఈ వేడుకలో షాహిద్ కపూర్ తో సహా పలు సినీ ప్రముఖులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ కోసం అభిమానులు.. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మూడు రోజుల వేడుకగా జరగనున్న ఈ ఈవెంట్ సెప్టెంబర్ 27న మొదలు కానుంది. 28న అవార్డ్స్ ప్రధానం జరుగుతుంది. 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది. 


ఇక ఈ సంవత్సరం నామినేషన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ యానిమల్ అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. కాగా తెలుగులో ఈ మధ్యనే జరిగిన అసలైన ఫిలింఫేర్ అవార్డులలో లాగానే ఐఫాలో కూడా.. నాని సినిమాలు మిగతా సినిమాలను.. డామినేట్ చేస్తున్నాయి. 


నాని దసరా, హాయ్ నాన్న సినిమాలు అత్యధిక నామినేషన్లు అందుకున్నాయి. నాని దసరా సినిమాకి 10 నామినేషన్లు దక్కగా, హాయ్ నాన్న కి 6 నామినేషన్లు వచ్చాయి. భగవంత్ కేసరి, బేబీ సినిమాలకి చెరొక 4 నామినేషన్లు వచ్చాయి. ప్రభాస్ సలార్ సినిమాకి 3 నామినేషన్లు అందాయి. ఈ ఐదు సినిమాలే బెస్ట్ సినిమా అవార్డుకి నామినేట్ అయ్యాయి. మరి అందులో ఏ సినిమాకి అవార్డు వస్తుందో వేచి చూడాలి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బెస్ట్ యాక్టర్ క్యాటగిరి లో నామినేషన్స్ కి రెండు సినిమాలతో నాని సెలెక్ట్ అయ్యారు.  సినిమా మాత్రమే కాకుండా బెస్ట్ నటీనటుల అవార్డుల గురించి కూడా.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. 


ఈసారి ఐఫా అవార్డ్స్ కోసం గట్టిపోటీ
ఉంటుంది అని నామినేషన్లు చూస్తేనే తెలుస్తోంది. హైదరబాద్ లో ఈ వేడుకకి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ లో హోస్ట్ లు సందడిచేయనున్నారు.


Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి


Also Read: Atchutapuram SEZ: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook