Ileana Dcruz Pregnancy గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ ను చూసిన ఎవరైనా ఆమె తల్లి కాబోతుందనే అర్థం చేసుకుంటారు. ఆమె కు పెళ్లి అయిన విషయం క్లారిటీ లేదు.. కానీ ప్రెగ్నెంట్ అనే విషయం మాత్రం కన్ఫర్మ్‌ అంటూ చాలా మంది ఆ పోస్ట్ ను చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి కాకుండా తల్లి ఎలా కాబోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఆమె ఘట్స్ కు హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్ చేయడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తానికి ఇలియానా ప్రెగ్నెన్సీ విషయం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇలియానా ప్రేమలో ఉందా.. లేదంటే ఇప్పటికే పెళ్లి చేసుకుందా అంటూ చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఇలియానా షేర్ చేసిన ఒక ఫోటో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇలియానా తల్లి కాబోతున్నట్లుగా షేర్‌ చేసినప్పటికి ఆమె గర్బవతి కాదు అనే విధంగా తాజా ఫొటో ఉంది. తాజాగా ఈ అమ్మడు బికినీ ఫొటోను షేర్ చేసింది. 


[[{"fid":"270553","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆ ఫోటోలో ఇలియానా బేబీ బంప్ కనిపించడం లేదు. అంతే కాకుండా ఆమె గర్భవతి అయితే ఇలా బికినీ లో కనిపించేది కాదని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఇలియానా గర్భవతి అనుకుని తెగ కంగ్రాట్స్ చెప్తే ఇలా ట్విస్ట్‌ ఇచ్చింది అంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే మరి కొందరు మాత్రం ఇంకా ఆమె బేబీ బంప్ కనిపించేంత ఎక్కువ వారాలు.. నెలలు అవ్వలేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలియానా తాజా ఫోటోతో వార్తల్లో నిలిచింది. హీరోయిన్‌ గా ఇలియానా ఈమధ్య కాలంలో గతంలో మాదిరిగా బిజీగా లేదనే చెప్పాలి. 


Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ


ఒకప్పుడు సౌత్‌ లో ముఖ్యంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియానా స్టార్‌ హీరోలకు జోడీగా నటించి ఒకానొక సమయంలో నెం.1 హీరోయిన్ గా నిలిచింది. తెలుగు లో ఈ అమ్మడు మొదటి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ గా నిలిచింది. టాలీవుడ్‌ లోబిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు అక్కడ పలు సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ కూడా పెద్దగా ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకోలేక పోతుంది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని ఈ అమ్మడు ఆశ పడుతుంది. కానీ ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది.


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook