Income Tax Raids Updates on Tamil Producers: తమిళ సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు ఉదయం నుంచి వరుసగా నిర్మాతలు,  ఫైనాన్షియర్ల ఆఫీసుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపైనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై రాయపేటలోని సినీ నిర్మాత సత్య జ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ కార్యాలయాలపై ఆలయ పన్ను శాఖ అధికారులు దాడి చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన ఆఫీసు పై దాడి చేయడాని కంటే ముందు ప్రముఖ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ అలాగే కలైపులి ఎస్ థాను,  ఎస్ఆర్ ప్రభు,  జ్ఞానవేల్ రాజాలకు చెందిన ఆఫీసులు,  ఇళ్లపై కూడా ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పలుచోట్ల తనిఖీలు పూర్తికాగా మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అందరికంటే ముందు సినిమాలకు ఫైనాన్స్ చేసే అన్బు చెళియన్ ఇంటిపైన ఆయన ఆఫీసుల పైన సుమారు నలభై చోట్ల తెల్లవారుజాము నుంచే ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.


ఇప్పటివరకు ఈ దాడులలో 13 కోట్ల రూపాయలు లెక్క తేలని సొమ్ము గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ఆయన సోదరుడు ఇంట్లో అలాగే కార్యాలయాల్లో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే చెన్నైలోని నుంగంభాగం ఒక ఇంటికి తాళం వేసి ఉందని తమ వద్ద తాళాలు లేవని సెక్యూరిటీ సిబ్బంది ఐటీ అధికారులకు చెప్పడంతో ఉదయం నాలుగు గంటల నుంచి సుమారు నాలుగు గంటల పాటు చూశారు. అలా చూసిన తర్వాత అధికారులు అసహనానికి గురయ్యారు.


కోపోద్రిక్తులైన అధికారులు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడి తాళాలు తెప్పించాలని లేకపోతే తాళాలు పగలగొట్టి ఇంట్లో సోదాలు చేయాల్సి ఉంటుందని కోర్టు ఉత్తర్వులు కూడా వస్తాయని హెచ్చరించారు. అయితే ఇంటి లోపలి తలుపులకు తాళం లేదన,  దానికి బదులుగా ఆధునిక లేజర్ టెక్నాలజీ సహాయంతో ఒక సరికొత్త సిస్టం ఏర్పాటు చేశారని గుర్తించారు. ముఖం లేదా కన్ను లేదా వేలిముద్రలతో మాత్రమే తెచ్చుకునేలా ఆ ఇంటికి తలుపులు ఏర్పాటు చేశారని దీంతో ఏం చేయాలో పాలుపోక ఐటి అధికారులు సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది.


తాళం వేసి ఉన్న తలుపు బయటే కూర్చుని ఏం చేయాలనే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారని,  ఎవరికన్ను వేలిముద్రలు సరిపోతాయో తెలుసుకుని వారిని తీసుకువచ్చి తలుపులు తీయాలని అధిరికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇక అన్బు చెళియన్ ప్రస్తుతం అన్నాడీఎంకేతో పని చేస్తున్నాడని చెబుతున్నారు. మధురైలోని అన్బు చెళియన్ కు చెందిన దాదాపు 40 ప్రాంతాలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. అనేక కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకుందని అంటున్నారు.


Read Also: Uma Maheshwari: ముందు నుంచీ బాధలే.. మీకు తెలియని ఉమామహేశ్వరి జీవిత విషాదం.. రేర్ ఫోటోలు!


Read Also: Manchu Vishnu: షూటింగ్స్ బంద్ పై మంచు మౌన వ్రతం.. మిగతా హీరోలు కూడా నోరు విప్పనిది అందుకేనా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook