Uma Maheshwari: ముందు నుంచీ బాధలే.. మీకు తెలియని ఉమామహేశ్వరి జీవిత విషాదం.. రేర్ ఫోటోలు!

  • Aug 02, 2022, 16:54 PM IST
1 /6

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూసిన నేపథ్యంలో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

2 /6

అయితే ఉమామహేశ్వరి జీవితం పూల పాన్పు ఏమీ కాదని గతంలో ఆమె మొదటి భర్త విషయంలో అనేక ఇబ్బందులు పడిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ కు నలుగురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె పురంధరేశ్వరి గురించి అందరికీ తెలిసిందే. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 

3 /6

ఇక భువనేశ్వరి చంద్రబాబు భార్యగా పరిచయమే. ఇక లోకేశ్వరి సెలబ్రిటీ కాకపోయినా అడపాదడపా ఆమె సినిమా ఫంక్షన్స్ లో కనపడుతూనే ఉంటారు. వీరందరి  గురించి తెలిసినా ఉమామహేశ్వరి జీవితం గురించి పెద్దగా బయట ఎవరికీ తెలియదు. నిజానికి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారనే విషయం ఆమె మరణించిన తర్వాత వెళ్లడయింది. 

4 /6

నిజానికి ముందుగా ఆమెకు నరేంద్ర రాజన్ అనే తమిళ వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు.  ఆయన మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి బంధువు అవుతారట. అయితే ఉమామహేశ్వరి ఆయన వల్ల అనేక ఇబ్బందులు పడిందని, ఆయన మద్యానికి బానిసై సిగరెట్లతో కూడా కాల్చేవారని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టిన తండ్రి పరువు పోతుందనే ఉద్దేశంతో ఆమె బాధలన్నీ పంటి బిగువున భరించిందట. 

5 /6

చాలా కాలం తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ నరేంద్ర రాజన్కు విడాకులు ఇప్పించారు. ఆ తర్వాత అమెరికాలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కంఠమనేని శ్రీనివాసప్రసాద్ అనే ఆయనను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారికి ఇద్దరు ఆడ సంతానం కలిగారు. 

6 /6

 అందులో మొదటి ఆమెకు ఇప్పటికే వివాహం కాగా ఆమె అమెరికాలో నివాసం ఉంటున్నారు. రెండో కుమార్తె దీక్షితకు కూడా ఇటీవలే వివాహం ఘనంగా జరిపించారు. ఆమె బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు బోనాల సందర్భంగా ఆమె ఇంటికి వచ్చిన సమయంలోనే ఉమామహేశ్వరి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక ఈ సందర్భంగా ఉమామహేశ్వరి కొన్ని రేర్ ఫొటోస్ ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం