రివ్యూ: ‘ఇంద్రాణి ’.. Epic Dharam Vs Karam (Indrani)
నటీనటులు : యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, అజయ్, స్నేహ గుప్తా, సంజయ్ స్వరూప్, గరిమ కౌశల్, సప్తగిరి తదితరులు..
సంగీతం : సాయి  కార్తీక్
ఎడిటర్ : రవితేజ కుర్మానా
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
నిర్మాత : ష్రాయ్ మోషన్ పిక్చర్స్
దర్శకత్వం : స్టీఫెన్ పల్లం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Indrani: మన దేశంలోనే  మొట్టమొదటి ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీ అంటూ 'ఇంద్రాణి' థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యానీయా సూపర్ ఉమెన్‌గా యాక్ట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..


కథ  విషయానికొస్తే..


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించిన తరువాత అంతర్జాతీయ శాంతిని కాపాడే బాధ్యతను మన దేశానికే అప్పగిస్తారు. ఇతర దేశాలతో మన దేశం పోటీ పడేందుకు ప్రధాని ISF (ఇండియన్ సూపర్ ఫోర్స్) పేరుతో ఒక సంస్థను స్థాపిస్తారు. అదే సమయంలో భారత్‌పై చైనా దాడి చేస్తోంది. ఈ సంఘటన సూపర్ ఉమెన్‌ ఇంద్రాణి (యానీయా)ని దేశాన్ని కాపాడానికి వెళుతుంది. ఈ క్రమంలో  తాను అనుకున్న లక్ష్యాన్ని ఇంద్రాని సాధించిందా..? అందుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


ఇంగ్లీష్ లో ఇలాంటి తరహా సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ తరహా పాత్రలను ఎన్నో చూశాము. తెలుగులో సూపర్ హీరో చుట్టూ ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ సూపర్ ఉమెన్ తరహా పాత్రలు మాత్రం రాలేదు. కానీ దర్శకుడు స్టీఫెన్ పల్లం మాత్రం తెలుగులో ఇలాంటి ో తరహా ప్రయోగం చేసాడు. తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త తరహా ఉండొచ్చు కానీ.. ఇక్కడ ఆడియన్స్ లో ఓ పావు శాతం మంది హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చూసొంటారు. దర్శకడు స్టీఫెన్ పల్లం తాను ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని ఇంకాస్త బెటర్ గా ఎక్స్ క్యూట్ చేసుంటే బాగుండేది. మరోవైపు అంతా కొత్త వాళ్లే కావడం ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే అంశం. ఏదైనా కొత్త తరహా ప్రయోగం చేయడాన్ని మాత్రం మెచ్చకోవాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ఆర్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.


నటీనటుల విషయానికొస్తే..
టైటిల్ రోల్లో ఇంద్రాణి పాత్రలో నటించిన యానీయా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె కత్తి యుద్ధం, నంచాక్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ద్వితీయార్థంలలో యానీయా, సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. బిగ్‌బాస్ బ్యూటీ, యూట్యూబర్ దీప్తి సునైనా న్యూస్ రిపోర్టర్‌గా పాత్రలో అలరించింది.  తన నటనతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. ఓవరాల్ గా ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తోంది.


ప్లస్ పాయింట్స్


కొత్త కాన్సెప్ట్


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


కథనంలో వేగం


లాజిక్ లేని సీన్స్


కొత్త నటీనటులు


పంచ్ లైన్..  ఓ వర్గం ప్రేక్షకులను అలరించే ‘ఇంద్రాణి’


రేటింగ్: 2.75/5


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter