Sarvadaman Banerjee Re Entry: 35 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో.. గాడ్ ఫాదర్లో చిరంజీవి నాన్న గారు ఎవరో తెలుసా..?
Interesting Facts About Father of Chiranjeevi in God Father: గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి, ముఖ్యమంత్రి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఆయన మరెవరో కాదు ఒకప్పటి హీరో సర్వదామన్ బెనర్జీ. ఆ వివరాల్లోకి వెళితే
Interesting Facts About Father of Chiranjeevi in God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సముద్రఖని, సునీల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో నటించారు. ఆయన తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
బహుశా ఆ పాత్రలో మురళీమోహన్ నటించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరో కొత్త మొహం తెరమీద కనిపించే సరికి ఎవరు అబ్బా ఆయన అని అందరూ అనుకున్నారు. అయితే నిజానికి ఆయన కొత్తవాడేమీ కాదు. తెలుగులో ఒక సినిమాలో హీరోగా నటించాడు. ఆయన పేరు సర్వదామన్ బెనర్జీ. కే విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల అనే సినిమాలో ఆయన అంధుడైన కళాకారుడిగా నటించారు. నిజానికి సర్వదామన్ బెనర్జీ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
దీంతో తెలుగు రాదు అందులో ఒక గుడ్డివాడి పాత్రలో నటించాలంటే చాలా కష్టమైన పని. అయినా చాలా అలవోకగా సిరివెన్నెలలో నటించి మెప్పించారు. ముందు సంస్కృత భాషలో వచ్చిన ఆదిశంకరాచార్య అనే సినిమాలో కూడా టైటిల్ పాత్రలు పోషించి సర్వదామన్ బెనర్జీ మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆ సినిమా చూసే సిరివెన్నెల సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారు విశ్వనాధ్ ఆ తర్వాత విశ్వనాథ్. సిరివెన్నెల తరువాత కూడా చిరంజీవితో చేసిన స్వయంకృషి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర కోసం ఆయనని ఎంపిక చేసుకున్నారు విశ్వనాధ్.
సుమలత భర్త పాత్రలో సర్వదామన్ బెనర్జీ నటించారు. తెలుగు సహా హిందీ, బెంగాలీ సినిమాల నుంచి ఆఫర్స్ వస్తున్నా బెనర్జీ మాత్రం రామానంద్ సాగర్ తీసిన కృష్ణ సీరియల్ లో శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. ఒకరకంగా ఆ పాత్రలో నటించడం ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అప్పటి నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి. తరువాత సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్వామి వివేకానంద అనే సినిమాలో కూడా బెనర్జీ వివేకానందుడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత నుంచి ఆయన హరిద్వార్ రిషికేశ్ అంటూ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మరి ఎలా ఒప్పించారో ఏమో తెలియదు గానీ 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి వయస్సు 67 ఏళ్లు కాగా సర్వదామన్ వయసు 57 మాత్రమే. అయినా ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించారు .
Also Read: Godfather Day 3 Collections: గాడ్ ఫాదర్ సినిమా జోరు.. మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook