Geetu Royal Vs Inaya Sulthana: మొదటి రోజే కిరికిరి పెట్టేసిన బిగ్ బాస్.. నువ్వా నేనా అనేస్థాయిలో గీతూ-ఇనయా
Interesting fight Between Geetu Royal and Inaya Sulthana: బిగ్ బాస్ షోలో అప్పుడే గొడవలు పెట్టడం మొదలు పెట్టారు నిర్వాహకులు. గీతూ, ఇనయా సుల్తానా మధ్య జరిగిన గొడవను హైలైట్ గా చూపించారు.
Interesting fight Between Geetu Royal and Inaya Sulthana: ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైన బిగ్ బాస్ షోలో అప్పుడే గొడవలు పెట్టడం మొదలు పెట్టారు నిర్వాహకులు. నిజానికి ఈ సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా 21 మంది సెలబ్రిటీలు ఎంటర్ అయిన అందులో బాగా తెలిసిన ముఖాలు రెండు మూడు మించి లేవు. ఎలా అయితేనేమి 21 మందిని హౌస్ లోపలికి పంపించారు కదా అందుకే గతం కంటే ఈసారి మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నాడు నామినేషన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే ఇక ఈ వారం కూడా ఎంటర్ అయిన రెండో రోజే నామినేషన్లు పెట్టడానికి ప్రయత్నించింది బిగ్ బాస్ యజమాన్యం. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల కాగా ఆ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఉదయాన్నే పక్కా లోకల్ అనే సాంగ్ తో నిద్రలేపిన బిగ్ బాస్ తర్వాత గీతూ, ఇనయా సుల్తానా మధ్య జరిగిన గొడవను హైలైట్ చూపించారు. బాత్ రూమ్ వద్ద ఉన్న సమయంలో గీతూ వచ్చి అక్కడ జుట్టు ఎక్కువగా పడి ఉండటంతో ఎవరు స్నానం చేశారని అడుగుతుంది.
దానికి మరో కాంటెస్టెంట్ ఇనయా సుల్తానా పేరు చెబుతారు. దీంతో వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిన గీతు ఆమెను ప్రశ్నించగా దానికి ఆమె ఇకమీదట మనం డ్యూటీలు వేసుకుని పని చేసుకుందామని అంటే నాకు ఒకవేళ బాత్రూంలో డ్యూటీ వచ్చి అక్కడ జుట్టు పడినా నా జుట్టు తప్ప నేను ఎవరి జుట్టు తీయనని అంటుంది. దీంతో ఇద్దరి మధ్య కాస్త వివాదం ప్రారంభమైంది. ఇక తరువాత బిగ్ బాస్ హౌస్ ను మూడు తరగతులుగా డివైడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు అన్నారు కానీ రెండు పేర్లు మాత్రమే ప్రోమోలో రివీల్ చేశారు. ఒకటి క్లాస్ గ్రూప్ కాగా మరొకటి ట్రాష్ గ్రూప్. ఇందులో ట్రాష్ గ్రూప్ కింద వచ్చిన వారంతా కిచెన్ ఏరియా వాడుకోకుండా గార్డెన్ లో వండుకుని తినాలని చెప్పారు.
అంతేకాక ట్రాష్ గ్రూపులో ఎవరెవరు ఉంటారో వారు ఈ వారం నామినేషన్స్ లో ఉంటారని చెప్పారు. అయితే ఎవరున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోయినా బిగ్ బాస్ సోషల్ మీడియా లీక్స్ ప్రకారం క్లాస్ తరగతి కింద శ్రీహాన్, సూర్య, బాలాదిత్యలకు విఐపి లాంజ్ యాక్సిస్ కూడా ఇచ్చారని అయితే ట్రాష్ కింద గీతు, ఇనయా సుల్తానా, రేవంత్ లు డైరెక్ట్ గా నామినేట్ అయ్యారని అంటున్నారు. ఇక వీరు కాకుండా మిగతా వాళ్ళు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.
Also Read: Archana Gautam on TTD Staff: తిరుమల కొండపై సినీ నటి రచ్చ! ఏడుస్తూ వీడియోలు రిలీజ్
Also Read: Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ 6లో రెండు జంటలు… మళ్లీ రెచ్చిపోయి దారుణ కామెంట్స్ చేసిన నారాయణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి