Salman Khan Pooja Hegde Love Affair: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రేమలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో ఉంటూ ఎక్కువ సమయం గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా చెప్పుకుంటూ వివాదాస్పద ట్వీట్లు చేసే ఉమైర్ సంధు తెలుసు కదా.. అతను వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. బ్రేకింగ్ న్యూస్ సల్మాన్ ఖాన్-పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారంటూ ట్వీట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘బ్రేకింగ్ న్యూస్: ఫిల్మ్ నగర్‌లో కొత్త జంట.. మెగా స్టార్ సల్మాన్ ఖాన్, పూజాహెగ్డేతో ప్రేమలో పడ్డాడు..! అతని ప్రొడక్షన్ హౌస్‌లో పూజా హెగ్డే రెండు సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం ఇద్దరు కలిసి సమయం గడుపుతున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరించారు..’’ అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. 


 



ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్‌తో అతనికి కౌంటర్ ఇస్తున్నారు. సల్మాన్‌ ఖాన్ వయసు ఏంటి..? పూజ హెగ్డే వయసు ఏంటి..? ఇదేక్కడి లింక్ రా బాబు అంటూ తిడుతున్నారు. మరికొందరైతే మా గురూజీ (త్రివిక్రమ్) ఏమైపోవాలి రా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. వారిద్దరిది ప్రేమ కాదని.. ఈ ట్వీట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. 


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాఉ. పర్హాద్ సాంజీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 


Also Read: Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తిప్పలు  


Also Read: Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి