Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Formula E Racing In Hyderabad: హైదరాబాద్ నగర వాహనదారులకు అలర్ట్. నగరంలో మరోసారి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫార్ములా-ఈ రేసింగ్ పోటీల నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 11:00 AM IST
  • ఈ నెల 9 నుంచి 11 వరకు ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు
  • హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఈ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Formula E Racing In Hyderabad: ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. గత నెల 19, 20వ తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లకు అర్ధాంతరంగా వాయిదా వేశారు. అంతకుముందు ప్రాక్టీస్‌లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రేస్ పోటీలు నిర్వహించలేదు. అప్పుడు ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ వెనక్కి ఇచ్చింది. 

ఈ నేపథ్యంలోనే మరోసారి కార్ రేసింగ్ పోటీలు నిర్వహించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 9 నుంచి 11 వరకు కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. దీంతో ఎన్టీఆర్‌‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు. 

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
 
► ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్‌ కోజ్

► బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు ప్రవేశంలేదు

► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు అనుమతి లేదు

► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు నో ఎంట్రీ

► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు రోడ్స్ మూసివేత

► బీఆర్‌‌కే భవన్ నుంచి నెక్లెస్  రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు

► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ మూసివేత

► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌‌ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్లు మూసివేత 

Also Read: Assembly Election Result 2022: నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. గెలుపు ఎవరిది..?  

Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు షాక్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News