Kalki Sequel: కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్.. వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా చూసినా ప్రేక్షకులు అందరూ.. ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందా.. అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో.. చూడడానికి అభిమానులు కలలు కంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కల్కి సినిమాకి విడుదలకే.. ఇన్ని రోజులు పట్టింది.. ఇక ఈ సినిమా సీక్వెల్ కి ఇంకెన్ని రోజులు పడుతుందో అని అభిమానులలో ఆందోళన మొదలైంది. కానీ తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ క్లారిటీ ఇచ్చింది.


ఇప్పటికే కల్కి సీక్వెల్ షూటింగ్ 60% పూర్తయిపోయిందట. ఈ వార్త ప్రభాస్ అభిమానులలో.. సంతోషాన్ని నింపింది. అయితే ఇంకా సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు.. చిత్రీకరించాల్సి ఉంది. అవి కూడా పూర్తయి పోతే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయినట్లే. 


అయితే విడుదల తేదీ.. మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. దానికి సంబంధించి.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. విడుదల తేదీ తెలియకపోయినా.. షూటింగ్ ఎలాగో సగం కంటే ఎక్కువ పూర్తయిపోయింది. కాబట్టి ఈ సినిమా కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. 


దీపిక పడుకొనే హీరోయిన్ గా కనిపించిన.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. కల్కి రెండవ భాగంలో కూడా వీళ్ళ పాత్ర ఎక్కువగానే ఉంటుంది. ఇక కల్కి సినిమాలో.. చాలామంది ఈ స్టార్లు కామియో పాత్రలలో కూడా కనిపించారు. మరి కల్కి సీక్వెల్ కోసం ఎవరిని తీసుకురాబోతున్నారు అని కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. 


అంతేకాకుండా సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర ఎలా ఉండబోతోంది, శ్రీకృష్ణుని పాత్రలో.. ఎవరు కనిపించబోతున్నారు అని కూడా అభిమానులు ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు. వైజయంతి మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898 ఏడి సినిమాకి సంతోష్ నారాయణను సంగీతాన్ని అందించారు.


Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి