Inti No.13: ఆడియన్స్‌ను భయపెట్టేందకు వస్తోన్న ఇంటి నంబర్ 13.. మార్చి 1న థియేటర్స్‌లో విడుదల..
Inti No.13: తెలుగు సహా అన్ని ఇండస్డ్రీస్లో మాస్ సినిమాల తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టకునే జానర్ హార్రర్. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం `ఇంటి నంబర్ 13`. గతంలో ఈ టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా వచ్చిన మంచి విజయాన్ని అందుకుంది. ఇపుడు అదే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Inti No.13: ‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి హారర్ థ్రిల్లర్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పన్నా రాయల్. ఆయన దర్శకత్వంలో వస్తోన్న మరో హార్రర్ మూవీ ఇంటి నంబర్ 13'. ఈ సారి ప్రేక్షకులను భయపెట్డడానికి మార్చి 1 ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని హార్రర్ చిత్రాల్లాగా కాకుండా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.
రీగల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ బర్కతుల్లా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. హేషన్ పాషా ఈ సినిమాను నిర్మించారు.ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న టైటిల్.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. మార్చి 1న విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘ఇంటి నెం.13’ పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు పన్నారాయల్ మాట్లాడుతూ..
ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఎన్నో హార్రర్ సినిమాలు చూశారు. ఇంటి నంబర్ 13 వాటికి విభిన్నంగా ఉండబోతుంది. ఈ సినిమాలోని మిస్టరీ, సస్పెన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయాన్నారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్ థ్రిల్‌కు గురవుతారు. హారర్ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందన్నారు. టెక్నికల్ వేల్యూస్ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్.
ఈ తరహా సినిమాల్లో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాన్ని నజర్‌లో పెట్టుకొని హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో వీఎఫ్ఎక్స్ చేయించామన్నారు. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ వినోద్ యాజమాన్య మ్యూజిక్. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాడు. థియేటర్స్‌లో ఈ సినిమా చూసేవాళ్లకు గూస్ బంప్స్ రావడం పక్కా. సబ్జెక్ట్ విపరీతంగా నచ్చడం వల్ల ఔట్‌పుట్ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్ పాషాగారు ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్నారు.
నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ...
పన్నా నాకు ఏదైతే చెప్పారో దాన్ని యాజిటీజ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. అతని గత చిత్రాలను ఎంత తెరకెక్కించారో వాటిని మించి ఈ సినిమా ఉంటుందన్నారు.మార్చి 1న ఈ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. ఇంటి నంబర్ 13 మూవీని ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నవీద్ బాబు, శివాంగి మెహ్రా, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ దేవయాని ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పి.ఎస్. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయినాథ్ బద్వేల్ ఎడిటింగ్ నిర్వహించారు. పన్నా రాయల్ డైరెక్ట్ చేశారు.
Also read: West Bengal: అక్బర్, సీతా.. సింహాలకు వివాదస్పదంగా పేర్లు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వీహెచ్ పీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook