Mahashivratri Tour Packages: ఇండియన్ రైల్వే సరికొత్త ప్యాకేజీలు.. మహాశివరాత్రికి ప్రత్యేకం
IRCTC Mahashivratri Special: మహాశివరాత్రి భారతీయులందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈరోజున చాలామంది శివ భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటారు. అటువంటి వారి కోసం ఇండియన్ రైల్వే సరికొత్త ప్యాకేజీలు తీసుకువచ్చింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
South India Tour: ఈ సంవత్సరం దేశమంతటా మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకుంటున్నారు ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ వారు శివ భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి టూర్ ప్యాకేజీ ను ప్రారంభించారు. ఈ ప్యాకేజీ పేరు సౌత్ ఇండియా మహాశివరాత్రి స్పెషల్. ఈ ప్యాకేజీని ఉపయోగించుకున్న భక్తులు సౌత్ ఇండియాలో పేరుపొందిన శైవ క్షేత్రాలను దర్శించవచ్చు. మరి ఈ శివరాత్రి స్పెషల్ టూర్ ప్యాకేజీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ?ఎలా బుక్ చేసుకోవాలి? ఏ క్షేత్రాలను కవర్ చేస్తుంది తెలుసుకుందాం..
మహాశివరాత్రి స్పెషల్ గా IRCTC ప్రారంభించిన ఈ ప్యాకేజీ కు సంబంధించి ముంబై నుంచి బయలుదేరే యాత్రికులు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన కొన్నిసార్లు క్షేత్రాలను కవర్ చేస్తారు. భారతదేశంలో టూరిజంను ఎంకరేజ్ చేయడం కోసం రైల్వేస్ వారు తీసుకున్న నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. మీ బడ్జెట్ లో అద్భుతంగా సౌత్ లోని శైవ క్షేత్రాలను కవర్ చేసే అవకాశం కల్పించే ఈ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలు..
మహాశివరాత్రి టూర్ ప్యాకేజ్:
ఈసారి దేశంలో ఎన్నడూ లేని విధంగా మార్చి 8 న మహాశివరాత్రి పురస్కరించుకొని ఇండియన్ రైల్వేస్ వారు శివ భక్తుల కోసం కేవలం 38 వేల రూపాయలతో ముంబై నుంచి దక్షిణ భారతంలోని శైవ క్షేత్రాల కు వెళ్ళి దర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ టూర్ ప్యాకేజీ పేరు సౌత్ ఇండియా మహాశివరాత్రి స్పెషల్(WMA47A). ఈ ప్యాకేజీ శివరాత్రికి ఒక రోజు ముందు అంటే మార్చి 7 2024న ముంబై లో ప్రారంభమై తిరిగి 12 మార్చ్ 2024 కు యాత్ర పూర్తి అవుతుంది.
దర్శించే ప్రదేశాలు:
సౌత్ ఇండియా మహాశివరాత్రి స్పెషల్ పేరు తో ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన ప్యాకేజీ యాత్రికులను ముంబై నుంచి మధురై- రామేశ్వరం -కన్యాకుమారి-త్రివేండ్రం ప్రాంతాలకు తీసుకువెళ్తుంది. ఈ ఆధ్యాత్మికమైన టూర్ ప్యాకేజీ ద్వారా దక్షిణ భారత దేశంలోని కొన్ని పవిత్ర ఆలయాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
ప్యాకేజీ వివరాలు:
ఈ టూర్ ప్యాకేజీ తీసుకున్న వారు ముంబై నుంచి విమానంలో బయలుదేరి మధురై, రామేశ్వరం, కన్యాకుమారి ,త్రివేండ్రం ,కోవలం మొదలైన ప్రాంతాలను సందర్శిస్తారు. మీరు తీసుకున్న ప్యాకేజీ లోనే మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్ తో పాటు హోటల్ గది ,ఉదయం అల్పాహారం ,లంచ్ ,డిన్నర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు దిగిన హోటల్ నుంచి ఈ ప్రదేశాలకు మిమ్మల్ని క్యాబ్ ద్వారా తీసుకెళ్లే వసతిని కూడా కల్పిస్తారు.
ఈ ప్యాకేజీ ద్వారా ఒంటరిగా ప్రయాణించే వాళ్ళు రూ. 51,100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఇద్దరు ప్రయాణికులు ఉంటే ఒక్కొక్కరికి 39,600 పడుతుంది. అలాగే ముగ్గురు బుకింగ్ చేసుకుంటే మనిషికి 38,000 పడుతుంది. మీతో పాటు 5 నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలు ప్రయాణం చేస్తుంటే వారికి బెడ్ వసతి కావాలి అంటే 33,600 ..వద్దు అనుకుంటే 29,300 కటాల్సి ఉంటుంది.
బుకింగ్ చేసుకునే విధానం:
ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ముంబై లోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ కు వెళ్లి కౌంటర్ వద్ద ముంబై నుండి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ కావాలి అని అడిగి బుక్ చేసుకోవాలి. మెయిన్ లైన్ స్టేషన్ బిల్డింగ్ లోని IRCTC టూరిజం ఆఫీస్ లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం 9321901805, 8287931886 నంబర్లకు కాల్ చేసి సంప్రదించవచ్చు.
Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter