Ilaiyaraaja Biopic: భారతీయ సంగీత ప్రపంచంలో ఇళయరాజాను మాస్ట్రో అని పిలుస్తారు. ఎందుకంటే ఈయన తన సంగీతంతో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు. తన గాత్రంతో ఎంతో మంది శ్రోతలను ఉర్రుతలూగించాడు. ఆయన స్వరపరిచిన గీతాలు ప్రజల మదిలో నిలిచిపోయాయి. తెర వెనక సంగీతంతో ఎన్నో చిత్రాలకు ఊపిరిపోసిన ఇళయరాజా జీవితకథ త్వరలో తెరపైకి రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈయన తన కెరీర్ లో దాదాపు 1500 సినిమాలకు సంగీతం అందించారు. బాలీవుడ్ డైరెక్టర్ బాల్కీ ఇప్పుడు ఆయన జీవితకథను (Ilaiyaraaja Biopic) సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంగీత సామ్రాట్ గా ప్రజల హృదయాలను ఏలిన ఇళయరాజా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న నేపథ్యంలో సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మవిభూషణ్" పురస్కారంతో సత్కరిచింది. అంతేకాకుండా 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ కూడా అయ్యారు. 


అయితే గత కొంతకాలంగా ఇళయరాజా బయోపిక్ ను డైరెక్టర్ బాల్కీ తీయబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఇళయరాజా పాత్ర పోషించే నటుడి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన బయోపిక్ లో హీరో ధనుష్ నటించబోతున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బాల్కీ మాట్లాడుతూ.. ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కించాలని అనుకుంటున్నా. ఆ మూవీలో హీరోగా ధనుష్ చేయాలనీ ఆశపడుతున్నా.. అని అన్నారు. అలాగే ధనుష్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నారని బాల్కీ తెలిపారు. 


Also Read: Extra Ordinary Man: నితిన్ నయా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'డేంజర్ పిల్ల' సాంగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook