Is Naga Chaitanya Dating with Sobhita Dhulipala: 2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న చై-సామ్.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జోడి ఆరంభంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గతేడాది విడాకులు తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారనే విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. ఇక విడాకుల అనంతరం చై, సామ్ తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడాకుల అనంతరం నాగ చైతన్య, సమంతకు సంబందించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైకి సంబందించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. టాలీవుడ్‌ హీరోయిన్‌, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్‌ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారట. ఈ వార్తలు జోరుగా ప్రచారం కావడానికి కారణం లేకపోలేదు. 


సమంతతో విడాకుల తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున జూబ్లీ హిల్స్‌లోని తన కొత్త ఇంటిలోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఆ ఇంటికి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఒకే కారులో వెళ్లారట. కారును ఇంటిముందు పార్క్ చేసి.. లోనికి వెళ్లారట. అక్కడ కొద్ది సమయం గడిపిన అనంతరం తిరిగి వెళ్లిపోయారట. ఇవన్నీ కొందరు గమనించారట. అంతేకాకుండా  మేజర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా శోభితను కలవడానికి చై పలుమార్లు వెళ్లాడట. దాంతో వారిద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఉంది స్నేహ బంధమా? లేక ప్రేమ బంధమా? అనేది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. 30 ఏళ్ల శోభిత.. గూఢచారి, మేడ్ ఇన్ హెవెన్, మేజర్ లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు బంగర్రాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య.. త్వరలోనే థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో బిజీగా ఉన్నాడు. 


Also Read: Maharashtra Suicide: మహారాష్ట్రలో పెను విషాదం.. ఒకే ఇంట్లో 9 మృతదేహాలు!


Also Read: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల  స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook