Allu Arjun Arrest Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పుష్ప -2  ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అంతేకాదు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా మృతి చెందింది.9 సంవత్సరాలు ఉన్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా దీని తర్వాత హీరో అల్లు అర్జున్,  చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదయింది.  భారత న్యాయ సంహిత లోని సెక్షన్ 118 (1) కింద అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఈ వార్త పూర్తిగా వ్యాపించింది.


తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బారులు తీరుతున్నారు. తొలుత ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్, భార్య స్నేహ రెడ్డి పోలీస్ స్టేషన్ కి చేరుకోగా అనంతరం స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. దిల్ రాజు , బన్నీ వాసు సహా పలువురు ప్రముఖులు కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు.



అంతేకాదు విశ్వంభర సినిమా షూటింగ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా పోలీస్ స్టేషన్ కి వస్తున్నట్లు వార్తలు వచ్చినా  పోలీసుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా ఆయన రాకను వాయిదా వేసినట్లు సమాచారం. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో ఘాటుగా స్పందించింది. బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇకపోతే ఈ పరిణామాలు అన్నింటి మధ్య ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టారు.


 



 


" యునైటెడ్ వి స్టాండ్.. డివైడెడ్ వి ఫాల్..". (కలిసి ఉంటే నిలబడదాం విడిపోతే పడిపోతాం) అంటూ  పోస్ట్ చేశారు.దీనిపై పలువురు అభిమానులు కూడా రిప్లై ఇస్తున్నారు. మంచి టైమింగ్ లో బన్నీ కి దెబ్బ కొట్టేలా డీసీఎం ఈ పోస్ట్ పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Also read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.