Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు

Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం ఆసక్తి కల్గిస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2024, 03:48 PM IST
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు

Allu Arjun Arrest: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద  ఉన్న సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడ్డాడు. ఈ ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు సెక్షన్ 105, 118 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో మైత్రీ మేకర్స్‌పై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా ఇతర నేతలు తీవ్రంగా స్పందించారు. కేఏ పాల్ కూడా ఈ ఆరెస్టును ఖండించారు. 

తాజాగా వైసీపీ నాయకులరాలు లక్ష్మీ పార్వతి స్పందించారు.  ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు హస్తం ఉంటుందని తెలిపారు. సినిమా ఎలా ఉందో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లినప్పుడు ఏక్కడ ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వం తప్పని ఆమె స్పష్టం చేశారు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అదే సరైన విధానమైతే రాజమండ్రి పుష్కరాలు, కందుకూరు తొక్కిసలాటలో చంద్రబాబును కూడా ఎన్ని సార్లు అరెస్ట్ చేయాల్సి ఉంటుందని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో ఆయన శిష్యుడు ఉన్నారని, రెండు చోట్లా రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. 

Also read: Jamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News