Alia Bhatt and Ranbir Kapoor tie the knot in Mumbai, Pics Goes Viral: బాలీవుడ్‌ ప్రేమ పక్షులు రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఈ ఇద్దరు ఏడడుగులు వేశారు.  బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆలియా-రణ్‌బీర్‌ వివాహం ఘనంగా జరిగింది. రణ్‌బీర్‌ ఇళ్లు బాంద్రాలోని వాస్తులో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివాహాం పూర్తయ్యే వరకు నూతన జంట ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు బయటికి రాలేదు. చాలా గోప్యంగా వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసిన కపూర్‌ అండ్‌ భట్‌ కుటుంబం పెళ్లి జరిగేంత వరకు ఒక్క ఫోటోని కూడా లీక్‌ కానివ్వలేదు. అయితే ఫ్యాన్స్ కోసం ఆలియా ఫొటోలు పంచుకున్నారు. 'గత 5 సంత్సరాలుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో.. అక్కడే మా వివాహం జరగడం ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశారు. సోషల్‌ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.


పెళ్లి దుస్తుల్లో రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌లు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. డిజైనర్ చీరలో అలియా.. డిజైనర్ కుర్తాలో రణబీర్ మెరిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక వీరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రణ్‌బీర్‌ సోదరీమణులు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌.. నిర్మాత కరణ్‌ జోహార్‌.. వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్‌ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 



ఆలియా ట్‌కు సినిమాల్లోకి రాకముందు నుంచే రణ్‌బీర్‌ కపూర్ అంటే చాలా ఇష్టం. రణ్‌బీర్‌ నటనకు ఆమె పెద్ద అభిమాని. రాక్‌స్టార్‌ సినిమా కార్యక్రమంలో రణ్‌బీర్‌తో ఆలియా తొలిసారి మాట్లాడారు. ఆ పరిచయం కాస్తా స్నేహమైంది. రణ్‌బీర్‌ హీరోగా 2016లో తెరకెక్కిన యే దిల్‌ హై ముష్కిల్‌ సినిమాలో ఆలియా అతిథిగా కనిపించారు. ఆపై ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక బ్రహ్మాస్ర సినిమాతో మరింత దగ్గరయ్యారు. చివరకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 


Also Read: KGF Chapter 2 Record: బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'.. 15 శాతం ఎక్కువ!


Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook