Jabardasth Anchor Sowmya Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు కాస్త హద్దులు దాటినట్టు ఉన్నా కూడా జనాలు మాత్రం ఇష్టపడుతూనే ఉంటారు. ట్రెండింగ్ టాపిక్‌ల మీద ఆది ఎక్కువగా సెటైర్లు వేస్తుంటారు. ఇక యాంకర్లు, జడ్జ్‌ల మీద అప్పుడప్పుడు ఆది వేసే కౌంటర్లు మామూలుగా ఉండవు. ఒకప్పుడు అయితే యాంకర్ అనసూయతో పులిహోర కలిపినట్టుగా కౌంటర్లు వేసేవాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని సార్లు తన స్కిట్లో కావాలనే యాంకర్ అనసూయను పెట్టుకునేవాడు. ఆమె కలిసి స్కిట్లు వేసేవాడు. ఇక ఇప్పుడు అనసూయ వెళ్లిపోయింది. ఆ స్థానంలో కొన్ని రోజులు యాంకర్‌గా రష్మీ వచ్చింది. అయితే రష్మీతో మాత్రం ఆది అలాంటి రొమాంటిక్ పంచ్‌లు వేయడు. ఎందుకంటే రష్మీ సుధీర్ ట్రాక్ ఉంది. జనాలు దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అనేది ఆదికి తెలుసు. అందుకే రష్మీ ఉన్నన్ని రోజులు యాంకర్ మీద ఎక్కువగా కౌంటర్లు వేయలేదు.


కొత్త యాంకర్ సౌమ్య రావడంతో ఆది మళ్లీ తన పాత పద్దతిని ఎంచుకున్నాడు. సౌమ్యతో పులిహోర కలిపేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. ఇక స్కిట్లలో భాగంగా ఆది చేసే చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కావాలనే తన కోసం స్పెషల్ రోల్స్ రాసుకుంటాడు. సౌమ్య చేత మొత్తానికి బావా అనిపించుకున్నాడు. దొరబాబు, రైజింగ్ రాసుని బావమరదల్ని చేశాడు.


 



మా బావ ప్రతాపం చూస్తావా? అని దొరబాబును చూపిస్తూ రైజింగ్ రాజు రెచ్చిపోతాడు. మా బావ ప్రతాపం చూస్తావా? అని ఆదిని ఉద్దేశించి సౌమ్య అంటుంది. ఆ తరువాత రైజింగ్ రాజు దొరబాబు మీదకు వెళ్లి ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. నువ్ కూడా రా అంటూ ముద్దు పెట్టు అన్నట్టుగా ముందుకు వస్తాడు ఆది. దీంతో హే చీ పోరా అంటూ ఆదిని తోసేస్తుంది సౌమ్య. అలా ఈ ప్రోమో బాగానే వైరల్ అవుతోంది.


Also Read : Namrata Shirodkar : లవ్యూ మామయ్య గారు.. సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ నమ్రత ఎమోషనల్


Also Read : RC 15 Song Shoot : రామ్ చరణ్‌తో క్లోజ్‌గా కియారా అద్వాణీ.. ఉపాసన కామెంట్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook