RC 15 Song Shoot : రామ్ చరణ్‌తో క్లోజ్‌గా కియారా అద్వాణీ.. ఉపాసన కామెంట్స్ వైరల్

RC 15 Song Shoot రామ్ చరణ్‌ శంకర్ కాంబోలో రాబోతోన్న RC 15 సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్లు రాకపోయినా లీకైనా ఆడియోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 10:30 AM IST
  • న్యూజిలాండ్‌లో RC 15 యూనిట్
  • రామ్ చరణ్‌తో పోటీ పడుతున్న కియారా
  • ఉపాసన కొణిదెల రియాక్షన్ ఇదే
RC 15 Song Shoot : రామ్ చరణ్‌తో క్లోజ్‌గా కియారా అద్వాణీ.. ఉపాసన కామెంట్స్ వైరల్

Upasana Konidela on Kiara Advani : ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే తన పనులతో ఎంత బిజీగా ఉన్నా.. అపోలో బాధ్యతలతో ఎంత సతమవుతున్నా కూడా రామ్ చరణ్‌తో వెకేషన్స్ వెళ్లేందుకు ఆసక్తిని చూపుతూనే ఉంటుంది. మొన్నటి వరకు జపాన్లో రామ్ చరణతో కలిసి ఉపాసన సందడి చేసింది. అటు నుంచే అటే మళ్లీ ఆఫ్రికా అడవుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇప్పుడు మాత్రం ఉపాసన కు నో చాన్స్ అన్నట్టుగా మారింది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో చేయబోతోన్న చిత్రం కోసం న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే కియారా అద్వాణి, రామ్ చరణ్‌ల మీద పాటను షూట్ చేయబోతోన్నాడు. ఇలా అక్కడ ఉన్నా కూడా రామ్ చరణ్‌ మాత్రం తన వర్కౌట్లను కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. వెకేషన్లో ఉన్నా వర్కౌట్లు మాత్రం మానేదిలే అన్నట్టుగా కష్టపడ్డాడు.

తాజాగా చిత్రయూనిట్ అంతా కలిసి బ్రేక్ ఫాస్టో, లంచో చేసినట్టుగా ఉంది. రామ్ చరణ్‌, కియారా ఇద్దరూ కూడా బర్గర్లు తినడంలో పోటీ పడ్డట్టుగా కనిపిస్తోంది. సాంగ్ షూట్ డైట్ ఇన్ న్యూజిలాండ్ అంటూ రామ్ చరణ్‌తో కలిసి కియారా పోజులు ఇచ్చింది. దీనిపై ఉపాసన స్పందించింది. ఇలా తన భర్తతో కియారా క్లోజ్‌గా ఉండటంపై ఉపాసన రియాక్ట్ అయింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

మీ అందరినీ మిస్ అవుతున్నాను.. మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు.. నాకు ఎంతో నచ్చింది అంటూ ఉపాసన ఎంత స్పోర్టివ్‌గా తీసుకుని వారిని మెచ్చుకుంది. మొత్తానికి చాన్స్ దొరికితే మాత్రం న్యూజిలాండ్‌కు కూడా ఉపాసన వెళ్లేదని అర్థమవుతోంది. మరి రామ్ చరణ్‌ మళ్లీ తిరిగి హైద్రాబాద్‌కు ఎప్పుడు వస్తాడో చూడాలి. ఆ తరువాత రామ్ చరణ్‌ ఉపాసన మళ్లీ వెకేషన్‌కు ప్లాన్ చేసేట్టుగా కనిపిస్తోంది. న్యూయర్ సెలెబ్రేషన్స్ కోసం రామ్ చరణ్‌ ఉపాసన ఫారిన్‌కు వెళ్లేట్టు తెలుస్తోంది.

Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

Also Read : Vakkantham Vamsi Nithin Movie : ఎట్టకేలకు వక్కంతం వంశీకి చాన్స్.. అన్నీ నెగెటివ్ సెంటిమెంట్లే.. వర్కౌట్ అయ్యేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News