జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి విశాఖలో ఓ సెక్స్ రాకెట్‌లో పట్టుబడటం బుల్లితెరవర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో ఓ సెక్స్ రాకెట్ వెలుగు చూడగా.. ఆ సెక్స్ రాకెట్‌లో దొరబాబు, పరదేశి అడ్డంగా పట్టుబడ్డారు. ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం దందా నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఓ పథకం ప్రకారం దాడి చేసి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారని తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్‌లో దొరబాబు, పరదేశితో పాటు మరో నలుగురు మహిళలు, ఇద్దరు విటులను సైతం అరెస్ట్ చేశారు. రైడింగ్ సందర్భంగా పోలీసులకు పట్టుబడిన దొరబాబు తన ముఖం కనిపించకుండా కవర్ చేసుకుంటుండగా.. మరోవైపు పరదేశి మాత్రం దయచేసి తమ వివరాలను బయటకు వెల్లడించొద్దంటూ పోలీసులను వేడుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  


బుల్లితెరపై సంచలనం సృష్టించిన జబర్ధస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది లీడర్‌గా వ్యవహరిస్తున్న టీమ్‌‌లో దొరబాబు, పరదేశి ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాధారణంగానే దొరబాబు వ్యక్తిత్వాన్ని పరోక్షంగా హైలైట్ చేస్తూ హైపర్ ఆది వేసిన అనేక సెటైర్లు పేలుతుండటం.. ఆ పంచ్‌లన్నింటినీ దొరబాబు నవ్వుతూ స్వీకరిస్తుండటం ఆ షో చూసే వాళ్లందరికీ తెలిసిందే. హైపర్ ఆది సరదాగా సెటైర్లు వేసినట్టుగానే దొరబాబు సైతం అదే తరహాలో సెక్స్ రాకెట్‌లో పట్టుబడటంతో ఆది సరదాకు రాసుకున్న పంచ్‌లనే దొరబాబు నిజం చేశాడుగా అనే టాక్ బుల్లితెరవర్గాల్లో వినిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..