Natho Nenu Movie Review: డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, రాజీవ్‌ కనకాల, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులు రూపొందిన చిత్రం ‘నాతో నేను. జబర్దస్ట్‌ కమెడీయన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌ బుల్లితెరపై గుర్తింపు పొందిన శాంతికుమార్‌ తూర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరి చిన్న తెరపై కామెడీతో అలరించిన ఆయన వెండితెరపై తన సత్తా చాటాడా లేదా అన్నది తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ:
ఓ గ్రామంలో ఉన్నతస్థానంలో ఉన్న కోటీశ్వరరావు (సాయికుమార్‌).. కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే తరుణంలో ఓ స్వామిజీ కోటీశ్వరరావు కలిసి కష్టన్ని తెలుసుకుని ఓ వరమిస్తాడు ఆ తర్వాత ఏమైంది.  కోటిగాడు(సాయి శ్రీనివాస్‌) దీప (ఐశ్వర్య)తో పరిచయం, ఆపై ప్రేమలో పడడం జరుగుతుంది. ఇంటిలో పెద్దలు అంగీకరించకపోవడంతో ఐశ్వర్య సాయికి హ్యాండ్‌ వస్తుంది. దాంతో అతని జీవితం ఏమైంది. ఓ మిల్లులో పని చేసే కోటిగాడు (ఆదిత్య ఓం) అతను ఇష్టపడిన అమ్మాయి నాగలక్షీ (దీపాలి) మధ్య ఏం జరిగింది. 60 ఏళ్ల సాయికుమార్‌, 40 ఏళ్ల ఆదిత్య ఓం. 20 ఏళ్ల 
సాయి శ్రీనివాస్‌ల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ చివరికి ఏ తీరానికి చేరింది. స్వామిజీ సాయికుమార్‌కి ఇచ్చిన వరం ఏంటి? అన్నది కథ.


ఎలా ఉందంటే...
కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాయికుమార్‌ అద్భుతంగా నటించారు. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం నటన అమేజింగ్‌. ప్రేమ విఫలం పొందిన పాత్రలో సాయి శ్రీనివాస్‌ కూడా బాగా నటించారు. తొలిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్‌ తూర్లపాటి మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాశారు కానీ.. ఎగ్జిక్యూట్‌ చేయడంలో కాస్త తడబాటు కనిపించింది. మాటలు బావున్నాయి. కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు ఆకటుకున్నాయి. రెట్రోసాంగ్‌, ఐటెమ్‌ సాంగ్‌ ఆకట్టుకున్నాయి. 


మనిషి అనే దాని కంటే మనీ అనే రెండక్షరాల మీదే జీవితం నడుస్తోంది అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీనితో 20, 40, 60 ఇలా వయసు దశల వారీగా సాగిన ఈ కథలో సాయికుమార్‌, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్‌ పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ పాత్రలకు తగ్గట్లు చక్కగా ఆర్టిస్ట్‌లు కూడా నటించారు. ఆ సన్నివేశాలను దర్శకుడు నడిపించిన తీరు కూడా బావుంది. చేసిన మంచి ఎక్కడికీ పోదనే విషయాన్ని చక్కగా చెప్పారు. డబ్బు మాత్రమే పరమావధిగా భావించి దాని వెనకే జీవితం ఉందనుకుంటే చివరికి ఏమీ మిగలదు అనే చక్కని సందేశం ఇచ్చారు.


Also Read: World Cup 2023: ఇదేం క్రేజ్ భయ్యా.. భారత్-పాక్ మ్యాచ్‌కు ఏకంగా ఆసుపత్రి బెడ్స్‌ బుకింగ్  


సాయికుమార్‌ డైలాగ్‌లు అదిరిపోయేలా ఉన్నాయి. రాజీవ్‌ కనకాల, సివిఎల్‌ నరసింహరావు ఇతర ఆర్టిస్ట్‌లు పాత్రల మేరకు చక్కగా నటించారు. అయితే వాళ్ల పాత్రలను ఇంకాస్త పెంచి ఉంటే ఫుల్‌ఫిల్‌ అయ్యేది. సాయి శ్రీనివాస్‌, ఐశ్వర్య పాత్రలు యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేయాల్సింది. సినిమాలో సెట్లు, లొకేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్మాతలు కొత్త వారే అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అయినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫైనల్‌గా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్‌గా అనిపించింది. సంగీతం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఓవరాల్‌గా అయితే చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచారు. సందేశం, వినోదం కూడా ఓసారి చూడొచ్చు.


నాతో నేను సినిమా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి మనకు బంధువులు ఉండాలి అనుకో ఫ్యామిలీ ఉండాలి ఉంటేనే జీవితం చాలా మంచిగా సాగుతుంది అన్న సారాంశమే నాతో నేను సినిమా


సినిమా రివ్యూ: ‘నాతో నేను’
విడుదల తేది: 21-07-2023
సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్‌, సుమన్‌శెట్టి తదితరులు. 
సాంకేతిక నిపుణులు
కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి
సంగీతం: సత్య కశ్యప్‌
బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌ చిన్నా


Also Read: Hyundai Sante Fe:హ్యూందాయ్ నుండి ఈ కొత్త కారు చూశారా? డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోతారు


ఎడిటింగ్‌: నందమూరి హరి
ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల
బ్యానర్‌: శ్రీభవ్నేష్‌ ప్రొడక్షన్స్‌
సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి
నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
దర్శకత్వం: శాంతికుమార్‌ తూర్లపాటి


రేటింగ్ 2.75
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి