Hyundai Sante Fe: హ్యూందాయ్ నుండి ఈ కొత్త కారు చూశారా ? డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది

Hyundai Sante Fe Next Gen Car: హ్యూందాయ్ తీసుకొచ్చిన లగ్జరీ SUV కార్లలో శాంటా ఫె ఒకటి. గతంలో శాంటా ఫె సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కార్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. తాజాగా హ్యూందాయ్ శాంటా ఫెకు సంబంధించిన న్యూ జెనరేషన్ SUV కారు వచ్చేస్తోంది.`

Written by - Pavan | Last Updated : Jul 21, 2023, 08:31 PM IST
Hyundai Sante Fe: హ్యూందాయ్ నుండి ఈ కొత్త కారు చూశారా ? డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది

Hyundai Sante Fe Next Gen Car: హ్యూందాయ్ తీసుకొచ్చిన లగ్జరీ SUV కార్లలో శాంటా ఫె ఒకటి. గతంలో శాంటా ఫె సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కార్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. తాజాగా హ్యూందాయ్ శాంటా ఫెకు సంబంధించిన న్యూ జెనరేషన్ SUV కారు వచ్చేస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న లగ్జరీ ఎస్ యూవీ కార్లలో శాంటా ఫె కారుకు పాపులర్ ఎస్ యూవీ కారుగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా లాంచింగ్ కి రెడీ అవుతోన్న శాంటా ఫె న్యూ జనరేషన్ కారుకు సంబంధించిన డీటేల్స్ లీక్ అయ్యాయి. లీకైన హ్యూందాయ్ SUV కారు ఇంటీరియర్స్, ఎక్స్ టీరియర్స్, డిజైన్ ఎంతో ఎట్రాక్టివ్, ప్రీమియం లుక్స్‌లో కనిపిస్తోంది. ఈ కారు డిజైన్ చూస్తే SUV లవర్స్‌కి పిచ్చెక్కిపోవడం ఖాయం. కొంటే ఇలాంటి కారే కొనాలిరా అనేలా ఉంది ఈ హ్యూందాయ్ శాంటా ఫె కారు. 

హ్యూందాయ్ లగ్జరీ SUV కారు శాంటా ఫెలో కొత్త అప్‌డేట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. లుక్ వైజ్ ఎంతో క్రేజీగా కనిపిస్తోన్న ఈ కారులో ఎన్నో మాడిఫికేషన్స్ ఉన్నాయి. అందుకే కారు కొత్త లుక్‌లో దర్శనం ఇస్తోంది. చివరి ఎడిషన్ కారులో రౌండ్ ఎడ్జెస్ ఉండగా.. ఈసారి లుక్ అలా కాకుండా మార్పులు తీసుకొచ్చారు. ముందర H ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. యాంగులర్ ఆర్చ్ వీల్స్ సైతం చూడముచ్చటగా ఉన్నాయి. బ్లాక్ బాడీ క్లాడింగ్, అలాయ్ వీల్స్, విశాలమైన గ్రౌండ్ క్లీయరెన్స్, పొడవులో 5 మీటర్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.

hyundai-sante-fe-next-gen-SUV-car-review-designs-leaked-online.jpg

ల్యాండ్ రోవర్ స్టీరింగ్ వీల్‌ని మైమరిపించే అద్భుతమైన స్టీరింగ్ వీల్ హ్యూందాయ్ లగ్జరీ SUV కారు శాంటా ఫె సొంతం. ఇన్ఫోటెయిన్మెంట్, ఇన్‌స్ట్రూమెంటేషన్ కోసం రెండు వేర్వేరు స్కీన్ డిస్‌ప్లేస్ ఉన్నాయి. హ్యూందాయ్ శాంటా ఫెలో కారు సెకండ్ జనరేషన్ కారు, థర్డ్ జనరేషన్ కార్లు ఇండియాలో లాంచ్ అయినప్పటికీ అవి అంతగా సేల్ అవలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న న్యూ జనరేషన్ వెర్షన్ ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అంటే ఇంకా క్లారిటీ లేదు. 

ఇది కూడా చదవండి : Safe & Best Cars in India: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సేఫ్టీ కార్లు

ప్రస్తుతానికి ఇండియాలో హ్యూందాయ్ టక్సన్ కారు ప్రీమియం లగ్జరీ కేటగిరీలో సేల్ అవుతోంది. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ మేకర్స్ పోటాపోటీగా కొత్త ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ కంపెనీ కూడా కొత్త హ్యూందాయ్ శాంటా ఫె మోడల్‌ని కూడా ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇది కూడా చదవండి : Tips For Car Loans: కొత్త కారు కొంటున్నారా ? కారు లోన్ తీసుకుంటున్నారా ?

ఇది కూడా చదవండి : Tata Motors Cars on Discount: టాటా కార్లపై రూ. 50,000 డిస్కౌంట్ ఆఫర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News